Moviesలీకైన నమ్రత-మహేష్ ఫోటో.. నెట్టింట వైరల్..!!

లీకైన నమ్రత-మహేష్ ఫోటో.. నెట్టింట వైరల్..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు.. యమ జోరు మీద ఉన్నాడు. మిగతా హీరోలందరు పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నా.. ఈయన మాత్రం ఒక్కటంటే ఒక్కటి పాన్ ఇండియా సినిమా కూడా తీయకుండానే పాన్ ఇండియా లెవెల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ.. పాన్ ఇండియా క్రేజ్ ని సొంతం చేసుకున్న ఏకైక హీరోగా నిలిచాడు. ఇక వరుస హిట్లతో దూసుకుపోతున్న మహేష్.. గతేడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరూ సినిమాతో నాన్ బాహుబలి ఇండస్ట్రీ అందుకున్నాడు. ఇక ఆ తరువాత..ఆ సినిమా మంచి మాస్ హిట్ అందుకోవడంతో సూపర్ స్టార్ తదుపరి సినిమా అయిన సర్కారు వారి పాట మీద భారీ అంచనాలు పెరిగాయి.

సూపర్ స్టార్ మహేష్ తో యువ దర్శకుడు పరశురామ్ పెట్ల తీస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సర్కారు వారి పాట. ఇక్కడ మరో షాకింగ్ ఏమిటంటే..మహేష్ బాబు ఇప్పటివరకు తన కెరీర్ లో ఊహించని..పోషించని ఒక విభిన్న పాత్రతీ ఈ సినిమాలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో ఆయనకు జోడీగా హాట్ బ్యూటీ కీర్తి సురేష్ నటిస్తుండగా థమన్ అధ్బుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా షూటింగ్‌లో బిజీగా బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ బయటకు రావడంతో సర్కారు వారి పాట ఒక్కసారిగా ట్రెండ్ లోకి వచ్చింది. ఫస్ట్ నోటీస్ దెబ్బకు ట్విట్టర్ రికార్డులన్నీ బద్దలయ్యాయి. మహేష్ బాబు బర్త్ డే ఆగస్ట్ 9 సందర్భంగా.. సర్కారు వారి పాట ఫస్ట్ సింగిల్ రాబోతోన్న సంగతి తెలిసిందే. ఆయన అభిమానులు మరోసారి మహేష్ బాబు సత్త చూయించడానికి సిద్ధంగా ఉన్నారు.

అయితే తాజాగా మహేష్ బాబు ఫోటోలు కొన్ని లీక్ అయ్యాయి. బయట అలా తన భార్య నమ్రతతో కలిసి ఉన్న ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. మహేష్ బాబు ఎంతో సింపుల్‌గా ఉన్నా కూడా ఎంతో స్టైలీష్‌గా ఉన్నారు.దీంతో మహేష్ బాబు ఫోటోలు నెట్టింట్లో ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news