తెలుగులో నటవారసుల్లో టాప్ హీరో అనిపించుకున్న తొలి హీరో నందమూరి బాలకృష్ణ. స్టార్ హీరో కొడుకుగా పుట్టినంత మాత్రాన స్టార్ కాలేరు. ఎదో ఒక ప్రత్యేకత, అందం, అభినయం లేకపోతే ప్రేక్షకులు హర్షించరు. అలాంటి ఓ లెజెండ్ నందమూరి తారకరామారాము కడుపున పుట్టి, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు నట సింహం బాలకృష్ణ. నందమూరి నట వారసత్వాని అందిపుచ్చుకుని..టాలీవుడ్ కి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు అందించారు నట సింహం బాలకృష్ణ.
బాలకృష్ణ గురించి మనందర్కి తెలిసిందే..ఆయనకు కోపం ఎక్కువని..ఉన్నది మొదానే మాట్లాదేస్తారని..మనసులో ఒక్కటి పెట్టుకుని.. బయటకి ఒకటి చెప్పడం..చేయడం ఆయనకు చేత కాదని మనకు తెలిసిందే. ఎదుట ఉన్నది ఎవరైనా సరే.. ఎంత పెద్ద వ్యక్తయినా సరే..భ్యమం వణుకు లేకుండా.. తప్పు చేస్తే ఎవరిని వదలడు బాలయ్య…తప్పు చేసిన వాళ్లకి ఉగ్రరూపం చూపిస్తారు.
ముక్కుసూటిగా మరియు కుండా బద్దలు కొట్టినట్లుగా మాట్లాడడం తెలుగు చిత్ర పరిశ్రమలో బాలయ్య బాబు తరువాతే ఎవరైనా. ఆయనంటే ఇండస్ట్రీలో చాలామందికి భయం.. అలాంటి బాలుకృషణకు సినీ ఇండస్ట్రీలో ఓ వ్యతి అంటే విపరీతమైన భయమట. ఆయన ఎవరో తెలుసా..??.. ఎస్వీ కృష్ణారెడ్డి..!!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎస్వీ కృష్ణారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇండస్ట్రీలో ఎంతోమందికి జీవనోపాధిని కల్పించారు. అయితే అప్పట్లో నందమూరి బాలకృష్ణ, ఎస్వీ కృష్ణారెడ్డిల మధ్య చోటు చేసుకున్న ఒక సంఘటన అప్పట్లో యావత్ టాలీవుడ్ పరిశ్రమను ఆశ్చర్య పరిచింది. అప్పట్లో బాలకృష్ణ కథానాయకుడిగా..కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన టాప్ హీరో సినిమా షూటింగ్ టైంలో.. షాట్ బ్రేక్ లో సెట్స్ లో యూనిట్ సభ్యులతో కలిసి బాలకృష్ణ పేకాట ఆడుతుండగా.. అటువైపుగా వచ్చిన కృష్ణారెడ్డి ని చూసి బాలకృష్ణ ఠక్కున లేచి..భయంగా చేతులు కట్టుకొని.. ఏం మాట్లాడకుండా సైలెంట్ గా నిలబడ్డారట. దీంతో కృష్ణారెడ్డి “అయ్యో ఎందుకు నిల్చున్నారు. కూర్చోండి” అని అంటే..దానికి బాలయ్య ఏం సమాధానం ఇచ్చారో తెలుసా.. సారీ అండీ, మీరు గొప్ప డైరెక్టర్..మీ ముందు పేకాట ఆడుతూ పెద్ద తప్పు చేశాను. అందుకే చేతులు కట్టుకొని క్షమాపణ అడుగుతున్నాను” అని అన్నారట. ఇలా అందరినీ గడగడలాడించే బాలకృష్ణ…ఎస్వీ కృష్ణారెడ్డి పట్ల ఎంతో భయం భక్తి కలిగి ఉంటారు.