Gossipsతల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్.. ఆ పాన్ ఇండియా సినిమాల నుండి...

తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్.. ఆ పాన్ ఇండియా సినిమాల నుండి ఔట్..?

బాలీవుడ్ బ్యూటీ.. దీపికా పదుకొనే తల్లి కాబోతుందా..?? అంటే అవుననే అంటున్నాయి.. బాలీవుడ్ మీడియా వర్గాలు. ఇందుకు కారణం లేకపోనూలేదు. రణవీర్ సింగ్ -దీపికా పదుకొణె శుక్రవారం సాయంత్రం ముంబైలోని హిందూజా ఆసుపత్రి నుండి బయటకు వస్తూ మీడియా కంట పడ్డారు. అంతే ఇక అప్పటి నుండి దీపిక తల్లి కాబోతుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బాలీవుడ్‌లో స్టార్ కపుల్స్ రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే చాలాకాలం గుట్టుచప్పుడు కాకుండా ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. ఇక వన్ ఫైన్ డే ఈజంట అందరిముందు ఓపెన్ అయిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఈ జంట వివాహ బంధంతో ఒకటైయ్యారు. 2018లో వీళ్ళ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అబ్బో..అప్పట్లో ఎక్కడ చూసిన వీళ్లకు సంబంధించిన వార్తలే కనిపించాయిలేండి. ప్ర‌స్తుతం వీరిద్ద‌రి ప‌ర్స‌న‌ల్ లైఫ్‌,ప్రొఫెష‌న‌ల్ లైఫ్ చాలా సాఫీగా న‌డుస్తుంది.

ఇక రణ్‌వీర్ ప్రస్తుతం ‘83’తో పాటు పలు బడా సినిమా ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉండగా.. ఆయన భార్య దీపికా కూడా రణ్‌వీర్‌తో కలిసి ‘83’ సినిమాలో నటిస్తూనే.. పఠాన్, సర్కస్, సినిమాలతో పాటు.. తెలుగులో యంగ్‌ రెబెల్ స్టార్ ప్రభాస్ సరసన, నాగ్‌ అశ్విన్ డైరెక్షన్‌లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో కూడా నటిస్తోంది.

అయితే ఇప్పుడు దీపికపై రకరకాల ఊహాగానాలు… సడెన్ గా స్ప్రెడ్ అవుతున్నాయి. దీపిక ప్రెగ్నెంట్ అని..అందుకే చెక్ చేయించుకోడానికి హాస్పిటల్ కి వచ్చిందని అంటున్నారు కొందరు అభిమానులు. దీపిక గర్భవతి అయితే హ్యాపీనే..కానీ దీపిక ఫ్రెగ్నెంట్ అవ్వడం వల్ల ఇప్పుడు చేస్తున్న బడా సినిమలు అన్ని క్యాన్సిల్ చేసుకుంది అనే వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికి దీపిక ప్రెగ్నేంట్ అయ్యిందో లేదో తెలియదు కానీ..సోషల్ మీడియాలో మాత్రం ఈ విషయం పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news