Moviesపవన్ ఆ సినిమా చేసుంటే.. ఆ హీరో కధ వేరేలా ఉండేది..?

పవన్ ఆ సినిమా చేసుంటే.. ఆ హీరో కధ వేరేలా ఉండేది..?

“ఒక్కడు”.. మహేష్ బాబు కెరీర్ లో ది బెస్ట్ మూవీ. టాలీవుడ్ చరిత్ర తిరగరాసిన సినిమా. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ఒక్కడు. 2003 జనవరిలో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో అది పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టి సూపర్ స్టార్ మహేష్ బాబుకి హీరోగా అతి పెద్ద కమర్షియల్ సక్సెస్ అందించింది. ఇక ఈ సినిమాలో భూమిక యాక్టింగ్ అదరగొట్టేసింది. మహేష్ కెరీర్ ని మలుపు త్ర్రీప్పి కెరీర్ పరంగా అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ అందించిన సినిమా మాత్రం అప్పట్లో ఒక్కడు సినిమా అనే చెప్పాలి. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, ఓబుల్ రెడ్డి అనే విలన్ పాత్రలో నటించి ప్రేక్షకాభిమానుల నుంచి మంచి పేరు దక్కించుకున్నారు.

ఇక ఈ ఒక్కడు చిత్రం తోనే మహేష్ బాబు హీరో నుండి స్టార్ గా ఎదిగారనే విషయం మన అందరికి తెలిసిందే. ఆ సినిమాలో మహేష్ బాబు ని చూసి ఫిదా అవ్వని లేడీస్ లేరంటే నమ్మండి. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఒక్కడు సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచి, ఎన్నో ఏళ్ళు గడిచిన అభిమానుల మనసుల్లో ఇంకా గుర్తుంది. ఇప్పటికి ఈ సినిమా టీవీలో వస్తే..తీవీ కి అతుక్కుపోయి మరీ చూస్తుంటారు. ఇక ఈ సినిమాలో వేసిన చార్మినార్ సెట్ ఒక అద్భుతం. అలాగే సినిమాలోని పాటలు, ఫైట్స్ మరియు డైలాగ్స్ గురించి ఎంత చెప్పిన తక్కివే. ఈ సినిమాకి మణిశర్మ అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అతి పెద్ద అసెట్ గా నిలిచాయి. అయితే, నిజానికి ఈ సినిమా మహేష్ బాబు కోసం రాసుకునది కాదట. ఓ స్టార్ హిఒఇరో కోసం రాసుకున్నారట.

ఇక ఈ కధని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేయాలని అనుకున్నాడ‌ట‌ గుణశేఖర్. అయితే.. అప్పటికే చిరంజీవితో మృగరాజు లాంటి భారీ ఘోర‌మైన ప్లాప్‌ను తెరకెక్కించడం తో గుణశేఖర్ ను మెగా కాంపౌండ్ అసలు న‌మ్మ‌ లేదట. దీంతో ఈ కధను పవన్ రిజెక్ట్ చేసాడట. ఆ తరువాత ఇద్దరు హీరోస్ కి కూడా ఈ కధ చెప్పారట ..వాళ్ళు కూడా ఈ సినిమా చేయడానికి ఇంట్రస్ట్ చూపలేదట. దీంతో చివరకు గుణశేఖర్ మహేష్ బాబు కు ఈ కథ చెప్పి ఒప్పించాడట. ఇక్ ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో మనకు తెలిసిందే. ఒక్కవేళ్ ఈ సినిమాని పవన్ కళ్యాణ్ ఓకే చేసుంటే.. మరో బిగెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఆయన ఖాతలో పడుండేది..మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడు పవన్…

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news