సామాన్యుడిగా మొదలై అసామాన్యుడిగా ఎదిగిన వెండితెర దైవం రజినీకాంత్. చూపు తిప్పుకోనివ్వని అందం, వంద మందినైనా ఎదిరిస్తాడనే నమ్మకము. స్థాయి బాడీ లేకపోయినా ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనిపించుకున్న ఇమేజ్ ఒక్క రజనీకాంత్ కే సొంతం అనే చెప్పాలి. రజినీకాంత్..ఆరు అడుగుల అందగాడు కాదు కండలవీరుడు అసలే కాదు నల్లగా బట్టతలతో సన్నగా సామాన్యుడు కనపడతారు.
కానీ ఇదో అద్భుతం ఏదో ఆకర్షణ అభిమానులకు ఆయన ఆరాధ్య దైవం నిర్మాతల పాలిట కామధేనువు అతనే ఆయనే స్టైల్‌కి కేరాఫ్ అడ్రస్ సూపర్. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ ఉన్నటువంటి నటుడు ఈయన తెలుగులో తీసిన సినిమాలు అరుణాచలం, ముత్తు, రోబో, నరసింహ, శివాజీ, మొదలగు సినిమాలు మొదలగు సినిమాలు చాలా పేరు ప్రఖ్యాతులు తన సొంతం చేసుకున్నాడు.
రజనీకాంత్.. ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నాడు. తన అద్భుత నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే, ఇంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్న రజినీకాంత్ ను ఓ డైరెక్టర్ కొట్టారు. ఇప్పుడు కాదులేండి..ఆయన ఫస్ట్ మూవీ టైంలో. ఇంతకి ఆ డైరెక్టర్ ఎవరు..?? అసలు రజినీకాంత్ ను ఎంకు కొట్టారు..?? ఆ తరువాత ఏం జరిగింది..?? ఇప్పుడు ఇక్కడ మనం తెలుకుందాం రండి..!!
దర్శకుడు బాలచందర్ పరిచయం చేసిన ఎంతో మంది గొప్ప నటుల్లో రజినీ ఒకరు. కె. బాల చందర్ దర్శకత్వంలో ‘అపూర్వ రాగంగళ్’ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు రజనీకాంత్. మొదటి సినిమాతోనే అందరికీ రిజిస్టర్ అయిపోయాడు రజినీ. వెంటనే తెలుగు చిత్రం ‘అంతులేని కథ’కి రజనీని తీసుకున్నారు బాలచందర్. అయితే రజినీ తెలుగులో మొదటి సినిమా అంటే మనకు వెంటనే ‘అంతులేని కథ’ సినిమానే గుర్తొస్తుంది. కానీ రజినీకాంత్ తెలుగులో చేసిన మొదటి సినిమా’ చిలకమ్మ చెప్పింది’. ‘చిలకమ్మ చెప్పింది’ సినిమాలో హీరోగా తొలిసారి పూర్తిస్థాయి లీడ్ రోల్ లో నటించారు రజనీ. ఫస్ట్ టైం ఫుల్ లెంగ్త్ పాజిటివ్ హీరో రోల్లో రజనీకాంత్ కెరీర్ ను టర్న్ చేసింది ఈ సినిమా.
రజనీకాంత్ కు బాలయందర్ సినిమాలతోనే మంచి పేరు వచ్చింది. అయితే, బాల చందర్ కు నటనలో ఏమాత్రం అటు ఇటు అయినా ఆయనకు పిచ్చ కోపం వస్తుందట. బాగా నటిస్తే మాత్రం బాగామెచ్చుకునే వాడట. కాగా అతిలోక సుందరి శ్రీదేవి తమిళంలో తొలిసారి హీరోయిన్ గా బాలచందర్ దర్శకత్వంలోనే “మూండ్రు ముడిచ్చు” అనే సినిమాలో నటించింది. అందులో రజనీకాంత్ కూడా కీలక పాత్ర పోషించాడు. అయితే బాల చందర్ ఓ సీన్ లో రజనీకాంత్ బాగా నటించలేదని లాగి పెట్టి కొట్టాడట. ఇక శ్రీదేవి కూడా ఓ సీన్ లో 10,11 సార్లు టేకులు తీసుకుందట. ఆ విషయంలోనూ బాలచందర్ అసహనానికి గురయ్యాడట. అలా అప్పట్లో అంత కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ.. ఇలా ఈ రోజు మన్ ముందు సూపర్ స్టార్ గా నిలిచారు మన తలైవా రజినీ కాంత్.