జగపతి బాబు..ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కథానాయకుడిగా ఎంత గుర్తింపు పొందారో ప్రతినాయకుడిగా అంతకంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నారు జగపతి బాబు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో యాంగ్ రొమాంటిక్ హీరో జగపతి బాబు. ఆయన నటన సామాన్య, మధ్యతరగతి కుటుంబాలను బాగా ఆకట్టుకుంటుంది. ఇక అప్పట్లో శోభన్ బాబుకి ఎంత క్రెజ్ ఉందో ఆయన తరువాత ఇండస్ట్రీలో అంతటి గుర్తింపు తెచ్చుకున్న నటుడు జగపతి బాబు.
ప్రముఖ దర్శకనిర్మాత వి.బి. రాజేంద్ర ప్రసాద్ వారసుడిగా తెరంగ్రేటం చేసిన జగపతి బాబు వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. జగపతి బాబు.. బాగా సంపాదించినప్పటికీ జల్సారాయుడు కావటం, జూదాలు ఆడటం మరియు అడిగిన వారికీ కాదని అనకుండా డబ్బులు ఇవ్వటం అవి తిరిగి రాకపోవటం….ఇలా ఫ్రెండ్స్ తో విచ్చలవిడిగా ఖర్చు చేయటం, అతిగా దానాలు చేయటం వలన ఉన్న ఆస్తిని నిలబెట్టుకోలేకపోయారంట. దాంతో ఆయన విలన్ గా మారాలని అనుకుని.. లెజెండ్ సినిమాలో విలన్ గా చేశారంట. ఆ సినిమా నుండి వరుసగా విలన్ గా సినిమాలు చేస్తూ ఆర్ధికంగా స్థిరపడ్డారు.
ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా రాణించిన జగపతి బాబు. అనుకోకుండా సినిమాలకు కొంచం గ్యాప్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయనలోని మరో యాంగిల్ బయటపెడుతూ విలన్ గా మారారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘లెజండ్’ లో జగపతి బాబు విలన్ గా నటించి మెప్పించారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి తండ్రిగా, మామగా మెప్పిస్తున్నారు .