According some sources, Samantha to romance with Ram Charan in Sukumar directorial movie.
రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో తొలుత హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్‌ని ఎంపిక చేశారు. ఎందరినో పరిశీలించిన అనంతరం.. తాను తీయబోయే మూవీలో కథానాయికగా ఆమె సెట్ అవుతుందని భావించి, సుక్కూ ఆమెనే ఫైనలైజ్ చేశాడు. ఆమె కూడా ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. అయితే.. ఇంతలో ఏమైంది తెలీదు కానీ, ఇప్పుడు ఆమెని ఈ సినిమా నుంచి తప్పించారు. సడెన్‌గా ఆమెని తొలగించడానికి సరైన కారణాలు ఇంకా తెలియరాలేదు కానీ.. ఆమె స్థానంలో సమంతని సెలెక్ట్ చేసుకున్నట్లు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం నడుస్తోంది.
నిజానికి.. అనుపమని సెలెక్ట్ చేసుకోవడానికంటే ముందే ఈ చిత్రంలో సమంతని తీసుకోవాలని యూనిట్ భావించింది. ఆ తర్వాత తమ నిర్ణయం మార్చుకుని.. అనుపమవైపు మొగ్గు చూపారు. ఇప్పుడు ఆమెని తప్పించి.. మళ్ళీ సమంతనే తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ ఆమెతో సంప్రదింపులు కూడా జరిపారట. రెమ్యునరేషన్ కూడా ఫైనల్ చేశారట. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే.. అధికారిక ప్రకటన వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ ఇది నిజమే అయితే.. తొలిసారి చెర్రీ, సమంత వెండితెరపై రొమాన్స్ చేయనున్నారు. ఇండస్ట్రీలో చాలాకాలం నుంచి ఉన్న వీళ్లు.. ఇప్పటివరకు ఏ ఒక్క సినిమాలో కలిసి నటించలేదు. సుకుమార్ మూవీతో ఫస్ట్ టైమ్ వీరి జోడీ కుదరనుంది.