Gossipsరత్తాలుతో చిందులు వేయనున్న తారక్.. కాకపోతే ఓ చిన్న ట్విస్ట్!

రత్తాలుతో చిందులు వేయనున్న తారక్.. కాకపోతే ఓ చిన్న ట్విస్ట్!

Hot actress Laxmi Rai another bumper offer. She is all set to tap her feet with Young Tiger NTR in his 27th film which will get launched on February 11.

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150 చిత్రం ‘ఖైదీ నెం.150’లో ‘రత్తాలు’గా తన హాట్ అందాలతో ఆకట్టుకున్న లక్ష్మీ రాయ్‌కి మరో బంపరాఫర్ వరించింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ 27వ చిత్రంలో అతనితో కలిసి ఓ ప్రత్యేక పాటలో చిందులేసే ఛాన్స్ దక్కించుకుంది. పూర్తి మాస్ మసాలా ఎంటర్టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో బాబీ ఓ స్పెషల్ సాంగ్ ఉండేలా ప్లాన్ చేశాడని, ఇది ఊరమాస్‌లా ఉండేలా డిజైన్ చేశాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. తారక్‌కి మాస్‌లో భారీ ఫాలోయింగ్ ఉంది కాబట్టి.. వారిలో ఎనర్జీ నింపేలా ఈ పాట ఉండనున్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే.. ఈ పాట విషయంలో ఓ చిన్న ట్విస్ట్ ఉందట.

ఇందులో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం పోషిస్తున్న విషయం తెలిసిందే. వాటిలో ఒక పాత్ర నెగెటివ్ షేడ్స్‌లో ఉండనుందని ప్రచారం జరుగుతోంది. ఆ విలన్ క్యారెక్టర్‌తో లక్ష్మీ రాయ్ స్పెషల్ సాంగ్ ఉంటుందని టాక్ నడుస్తోంది. సాధారణంగా.. ఐటమ్ సాంగ్స్ హీరోలతో ఉండేలా డిజైన్ చేస్తారు. లేకపోతే హీరో, విలన్ ఇద్దరూ ఐటెం గర్ల్‌తో కలిసి చిందులేసేలా చూస్తారు. కానీ.. విలన్ క్యారెక్టర్‌తో మొత్తం పాట చేయించడం ఇదే తొలిసారి. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్న ఈ సినిమాని కళ్యాణ్ రామ్ తన హోమ్ ప్రొడక్షన్‌ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news