ఈ విషయం మనకు తెలిసిందే. సాధరణంగా ఒక సినిమాలో చాలా ఫైట్స్, రిక్కీ షాట్స్, డేంజర్స్ షూట్స్ హీరోల కు బదులు వాళ్ళ డూప్ లను పెట్టి తీస్తారు. సినిమా షూటింగుల్లో రిస్కీ షాట్ తీయాలంటే మన హీరోలు డూపును పెట్టుకుని చేయిస్తుండటం సహజమే. అయితే బాహుబలి లాంటి భారీ బజట్ చిత్రంలో హీరోగా నటించిన బాహుబలి ప్రభాస్ కు కూడా కొన్ని సన్నివేశాల్లో డూపును పెట్టక తప్పలేదట రాజమౌళికి. కొన్ని ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తున్నప్పుడు బాహుబలి2లో కూడా ప్రభాస్ చేయలేని కొన్ని ప్రమాదకరమైన స్టంట్ లను కూడా డూప్ తో చేయించారు.
అయితే, ఒకప్పుడు తెలుగు సినిమాల్లో కూడా మన స్టార్ హీరోలకు ఏమాత్రం కష్టం రాకుండా డూప్ అరేంజ్ చేసేవాళ్లు దర్శకులు. కానీ, ఆ చరిత్రకు ఫుల్ స్టాప్ పెట్టి..సరికొత్త ట్రేండ్ తీసుకొచ్చారు మన మెగాస్టార్. తొలిసారి డూప్ లేకుండా యాక్షన్ సీన్లు చేసి శభాష్ చిరు అనిపించుకున్నారు. అయితే ఆయన చేసే రిస్కీ షాట్లను చూసి దర్శకులు సైతం భయపడ్డారట.
హిందీ సినిమా ‘ద జెంటిల్‌మన్’ సినిమాలో చిరంజీవి భుజం కింద ఛాతిలోకి బుల్లెట్ దూసుకెళ్లే సీన్ ఉంటుంది. బుల్లెట్ గాయాన్ని మాన్పేందుకు గన్ పౌడర్ గాయం మీద వేసి అంటించుకుంటే క్రాకర్ పువ్వొత్తిలా వెలుగుతుంది. దీంతో గాయం మానిపోతుంది.ఈ రిస్కీ సీన్ తానే చేస్తానని చెప్పాడు చిరంజీవి. అందుకు మహేష్ భట్ వద్దని చెప్పారట. డూప్ తో చేయిద్దామన్నారట. కానీ చిరంజీవి ఒప్పుకోలేదు. సెట్లో ఉన్నవాళ్లంతా టెన్షన్ పడుతున్నారు. గన్‌పౌడర్ బర్న్ అయ్యి మంట మండింది. సెట్ లో ఉన్నవాళ్లంతా చప్పట్ల మోత మోగించారు. కానీ తర్వాత చూస్తే చిరంజీవి చేయి కాలింది. ఆ తరువాత చిరు ఫస్ట్ అయిడ్ చేసారు. అంతేకాదు ఆ తరువాత తన సినిమాల్లో కూడా చాలా వరకు డూప్ లు లేకుండా తనే రిస్కీ షాట్లు చేసి.. తెలుగులో యాక్షన్ స్టార్‌గా మారిపోయారు.