“కరోనా”.. మూడు అక్షరాల పదం ప్రపంచ దేశాలను ముప్పుతిప్పలు పెడుతుంది. అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా ధాటికి అల్లాడిపోతుంది అంటే దీని ప్రభావం ఎంతలా ఉందో మనం ఉహించుకోవచ్చు. అయితే దురదృష్టవశాత్తూ ఈ కరోనా కి ఇంకా సరైనా మందు రాలేదు. ఇప్పుడు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు అన్ని కరోనా మీద అంతగా ప్రభావం చూపట్లేదు అని పలువురు ప్రముఖుల నుండి వినిపిస్తున్న మాట. సో.. ప్రస్తుతం మనం ఉన్న పరిస్ధితుల్లో చికిత్స కన్నా నివారణే మేలు. ఈ మాట అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ బారిన పడకుండా ఉండటమే ఇప్పుడు అందరికీ అవసరం. కరోనా వైరస్ను ఎదుర్కోవడానికి రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యం.
కరోనా మహమ్మారి చిన్న పెద్ద అని వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి పై తన పంజా విసురుతుంది. ఇక ఈ కరోనా మహమ్మారి వచ్చిన వాళ్లు కొన్ని ఫూడ్స్ తీసుకోకుడదని నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం..
కరోనా వచ్చిన వారు సోడియం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోకూడదట. ఎందుకంటే అవి మన రోగనిరోధక శక్తిని ఎఫెక్ట్ చేస్తాయట. ఎక్స్పెక్ట్ సూచన మేరకు ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ నీ కరోనా పేషెంట్ తీసుకోవాలి అంటున్నారు. మరీముఖ్యంగా నాన్ వెజిటేరియన్స్… డాక్టర్స్ చెప్పిన ప్రకారం కరోనా వచ్చినప్పుడు బీఫ్ మరియు మటన్ తీసుకోకూడదు. ఎందుకంటే వీటిలో సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. దానివల్ల ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువవుతుంది. అందుకని ప్రోటీన్స్ కోసం చేపలు మరియు స్ప్రౌట్స్ తినొచ్చు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న అవకాడో మరియు ఆలివ్ ఆయిల్ ని వాడొచ్చు. అంతేకాదు వీటితో పాటు ఎక్కువ స్పైసీగా ఆహారాన్ని తీసుకోకూడదు దానివల్ల గొంతుకు సంబంధించిన వ్యాధులు వస్తాయట.