ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వారి కంటే బయట వారికి ఎక్కువ అవకాశాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇది ఎప్పటి నుంచో వస్తున్న కంప్లైంట్. కానీ ఎవరూ పట్టించుకోకుండా పెద్ద హీరోలు ఈ రకం హీరోయిన్లకే మొగ్గు చూపుతుంటారు. అక్కడి వారిని ఇక్కడికి తీసుకువచ్చి అందలం ఎక్కించి వారిని స్టార్ హీరోయిన్ లు గా చేస్తూ ఉంటారు మన వారు. కానీ మన వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఈ సమస్య వెండితెర పైనే కాదు.. బుల్లితేర మీద కుడా ఇదే సీన్ రిపీట్ అవుతుంది.
ఇంట్లో కూర్చున్న వారికి ఎంటర్టైన్ అందించడంలో సీరియల్స్ ముందు వరుసలో ఉంటాయి. అందుకే సినిమాలతో పాటు సీరియళ్లకు కూడా మంచి క్రేజ్ ఉంటుంది. కొన్ని సీరియళ్లు అయితే సినిమాల కంటే ఎక్కువ రేటింగ్‌ని సంపాదిస్తున్నాయి. ఇక తెలుగులో చాలా సీరియళ్లు వీక్షకులను ఆకట్టుకుంటుండగా.. వారిలో పర భాష నటీమణులు కూడా ఉన్నారు. ముఖ్యంగా కర్ణాటక నుంచి చాలా మంది నటీమణులు తెలుగు బుల్లితెరపై దూసుకుపోతున్నారు. బుల్లితెరపై చాలా మంది నటులు చాలా పరిచయమైయ్యారు. ప్రస్తుతం బుల్లితెరపై కన్నడ భామల హంగామా నడుస్తుంది.
బుల్లితెర పై తెలుగు వారు కాకుండా కన్నడ నుంచి వచ్చిన వారి హవా ఎక్కువగా కొనసాగుతుంది. ప్రస్తుతం బుల్లితెర పై ఇండస్ట్రీలో దాదాపు అరడజనుకు పైగా కన్నడ భామల హవా కొనసాగిస్తున్నారు. మరి ఆ చందన పరిమళాలు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం..
కార్తీక దీపం సీరియల్లో అందమైన అత్త సౌందర్య పాత్రలో అందరినీ మెప్పిస్తోన్న అర్చనా అనంత్ కర్ణాటకలో పుట్టి పెరిగారు. కార్తీక దీపం సీరియల్లో విలన్ మౌనితగా తన నటనతో అందరినీ మెప్పిస్తోన్న శోభా శెట్టి కర్ణాటకలో పుట్టి పెరిగారు. కృష్ణ తులసి’ అనే ధారావాహికలో శ్యామ పాత్రలో నటిస్తోన్న కన్నడ హీరోయిన్ ఐశ్వర్య పుట్టి పెరిగింది అంతా బెంగుళూరులోనే.
అలాగే మనసిచ్చి చూడు’ సీరియల్ హీరోయిన్ వసుధారా కూడా అంతే. చంద్రముఖి, కృష్ణవేణి, నందిని వంటి సీరియళ్ల ద్వారా ఇక్కడ మంచి క్రేజ్ సంపాదించుకున్న మంజుల కర్ణాటకలో పుట్టి పెరిగారు. ఆమె కథ, నా పేరు మీనాక్షి సీరియళ్ల ద్వారా అభిమానులను ఆకట్టుకుంటోన్న నవ్య స్వామి కర్ణాటకలో పుట్టి పెరిగారు. అగ్ని సాక్షి, కస్తూరి సీరియళ్లలో అందరినీ ఆకట్టుకున్న ఐశ్వర్య పిస్సె కర్ణాటకలో పుట్టి పెరిగారు. అయితే ఇలా చాలామంది కన్నడ భామలు తెలుగు టీవీ సీరియల్స్ లో నటించి అలరిస్తున్నారు.