Movies"ముకుంద" సినిమాకి వరుణ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..??

“ముకుంద” సినిమాకి వరుణ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..??

వరుణ్ తేజ్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. వరుణ్ తేజ్.. యాక్టర్, నిర్మాత నాగేంద్రబాబు, పద్మజల ఒక్కగానొక్క ముద్దుల కొడుకు. ఆయన 1990జనవరి 19నజన్మించాడు. వరుణ్ ని అందరు ముద్దుగా వరుణ్ , విషు అని పిలుస్తుంటారు. ఈయన హైట్ సుమారుగా 6 అడుగుల 4 అంగుళాలు ఉంటుంది. ఇక ఈ మెగా హీరో చదువుల సంగతికి వస్తే.. యూసుఫ్ గుడా సెయింట్ మేరీస్ కాలేజ్ లో స్టడీస్ కంప్లీట్ చేసి..సినిమాల మీద ఇష్టంతో B.com తో చదువులకు ఫుల్ స్టాప్ పెట్టేసారు.

ఇక అనుకున్నదే ఆలస్యం కాకుండా..వరుణ్ సినిమాల పై ఫోకస్ చేసాడు. ఈ మెగా హీరో టాలీవుడ్ లోకి “ముకుంద” అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమా కలెక్షన్స్ పరంగా డిజాస్టర్ గా నిలిచినా.. మెగా హీరోకి కి మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. వరుణ్ మెదటి సినిమాకే 74 లక్షల పారితోషకం తీసుకున్నట్లు టాలీవుడ్ టాక్. ఇక ముకుంద సినిమా తరువాత వరుణ్.. చాలానే సినిమాలు చేసాడు. అందులో కొన్ని సక్సెస్ అయ్యాయి. మరికొన్ని బాక్స్ ఆఫిస్ దగ్గర్ డిజాస్టర్ గా నిలిచాయి, అయితే వరుణ్ మాత్రం జయాపజయలాతో సంబంధం లేకుండా.. కధ నచ్చితే చాలు వరుసుగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకుంటూ .. మిస్టర్,”కంచె”, లోఫర్, అంతరిక్షం, ఫిదా, గద్దల కొండ గణేష్, ఎఫ్ 2 సినిమాలో నటించాడు ఈ మెగా హీరో.

ఇక ఈ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వ్యక్తిగత విషయాలోకి వస్తే.. ఈయనకి హైదరాబాద్ ధం బిర్యానీ అంటే పిచ్చ ఇష్టమట. అంతేకాదండోయ్.. ఈ మెగా బుల్లోడికి నాలుగు కార్లు.. గాయత్రీ హిల్స్ లో అదిరిపోయే గెస్ట్ హౌస్ కూడా ఉన్నాయట. ఇక ప్రస్తుత్తం తను ..తెలంగాణలోని హైదరాబాద్ మణికొండలోని విల్లాలో ఉంటున్న సంగతి తెలిసందే..అయితే ఈ విల్ల ఖరీదు తెలిస్తే దిమ్మ తిరిగిపోతుందండోయ్.. దీని ఖరీదు అఖరాల 9కోట్ల పై మాటే. ఈ లెక్కన మనం చూసిన్నట్లైతే ఈ మెగా ప్రిన్స్ వరుణ్ కి కోట్లా ఆస్తి ఉన్నట్లుందండోయ్..!!

ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న.. ఈ మెగా హీరో వరుణ్ తేజ్ ..ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం గా ఉన్నట్లు తెలుస్తుంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న ‘గని’.. అనిల్ రావిపూడి దర్శకత్వంలోని ‘ఎఫ్ 3’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం గా ఉన్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news