యాంకర్ ఓంకార్ .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లి తెర పాపులర్ యాంకర్ ఓంకార్. ఓంకార్ బుల్లితెరపై ఎంత పాపులర్ యాంకరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓంకార్ పూర్తిపేరు ఆడియట్ల ఓంకార్. ఇతను 1980 మార్చి 13న తెనాలి లో జన్మించాడు. తండ్రి పేరు ఎన్.వి కృష్ణ రావు, తల్లి గృహిణి ఓంకార్ కి అశ్విన్ ,కళ్యాణ్ అనే ఇద్దరు సోదరులు ఉన్నారు .అలాగే వీరితో పాటుగా చెల్లి శ్రీవల్లి కూడా ఉంది .
ఓంకార్ .. కేవలం యాంకర్ గానే కాకుండా డైరెక్టర్ గా, యాక్టర్ గా సినీ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు ఎన్నో షోలలో యాంకరింగ్ చేస్తూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. అయితే సాధారణంగానే ఓంకార్ అన్నయ్య ఉన్నారు అంటే ఆ షో లో జడ్జిమెంట్ హడావుడి మాములుగా ఉండదు.
నిజానికి బుల్లితెర షోస్ అంటేనే జడ్జిమెంట్ హడావుడి అదే ఓంకార్ అన్నయ్య షో అంటే మరింత ఎక్కువ. ఎందుకంటే రేటింగ్స్ విషయంలో ఎంతో కష్టపడే యాంకర్ ఓంకార్. అందుకే గత 15 ఏళ్లలో ఎన్నో షోస్ చేసిన ఓంకార్ అన్నింటిలోనూ టాప్ లో ఉంటాడు.
గతంలో జీ తెలుగులో ఓంకార్ వ్యాఖ్యాతగా బాధ్యతలు నిర్వర్తించిన రియాలిటీ డాన్స్ షో ‘ఆట’ ప్రసారమైన సంగతి తెలిసిందే. ఈ షోలో సుందరం మాస్టర్, అమ్మ రాజశేఖర్, నటరాజ్ పలువురు జడ్జీలుగా పని చేశారు. అయితే ఆట డాన్స్ లో ఓంకార్ యాంకర్ గా చేసినప్పుడు రోజుకి 60,000 రూపాయలు నుంచి 70,000 రెమ్యూనిరేషన్ తీసుకున్నాడట.
ఇకపోతే ఓంకార్ ఆస్థి విషయానికి వస్తే ఇతడికి దాదాపుగా 35 కోట్లు వరకు ఆస్తి ఉన్నట్లు సమాచారం. యాంకర్ ఓంకార్..అతి తక్కువ సమయంలోనే తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరును సంపాదించుకున్నాడు .