Moviesఉప్పెన లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మిస్ చేసుకున్న హీరో...!

ఉప్పెన లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మిస్ చేసుకున్న హీరో…!

మెగా మేనల్లుడు వైష్ణవి తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా ఉప్పెన. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన‌ బాక్సాఫీస్ దగ్గర వ‌సూళ్ల‌ వర్షం కురిపించింది. కోలీవుడ్‌ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీ రోల్ పోషించిన ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి 12 న రిలీజ్ అయ్యి రు. 50 కోట్ల పై చిలుకు వసూళ్లు రాబట్టింది. ఓ డెబ్యూ హీరో మూవీ ఈ రేంజ్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్‌ అంటే పెద్ద సంచలనమే అని చెప్పాలి.

ఈ సినిమాతోనే వైష్ణవ్ తేజ్ – కృతి శెట్టి – బుచ్చిబాబు కు తిరుగులేని క్రేజ్ వచ్చింది. వాస్తవంగా ఈ సినిమాకు మొదట హీరోగా విజయ్ దేవరకొండ అనుకున్నారట. ఈ విషయాన్ని దర్శకుడు బుచ్చిబాబు స్వ‌యంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. విజయ్ దేవరకొండ ను దృష్టిలో పెట్టుకుని కథ రాసుకున్నాడట. అయితే విజయ్ దేవరకొండ ను సంప్రదించటం కుద‌ర‌క‌పోవ‌డంతో వెంట‌నే బుచ్చిబాబు వైష్ణ‌వ్‌ను క‌లిసి క‌థ చెప్పి ఓకే చేయించుకోవటం జ‌రిగింది. చివరకు ఆ సినిమా బ్లాక్బస్టర్ హిట్ అయ్యి.. ఎందో త‌ల‌రాత‌లు మార్చేసి.. వారిని స్టార్లుగా నిల‌బెట్టింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news