రోబో.. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాక్స్ ఆఫిస్ ని షేక్ చేసిన సినిమా అనే చెప్పాలి. 2010 అక్టోబరు 2 న విదుడలయ్యిన తెలుగు చిత్రం రోబో. తమిళ చిత్రం ఎంధిరన్ కు ఇది తెలుగు అనువాదం. డైరెక్టర్ శంకర్,తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబోలో వచ్చిన రోబో మూవీ ఓ సంచలనం. ఇందులో రోబో పాత్రలో, శాస్త్రవేత్త పాత్రలో రజనీకాంత్ నటన అద్భుతం. ఇక ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఇందులో విలన్ గా డ్యాన్ నటించాడు.
అయితే నిజానికి రోబో మూవీలో విలన్ పాత్ర చేయాల్సింది డ్యాన్ కాదట. రోబో సినిమాలో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ని తీసుకోవాలని అనుకున్నారట. కానీ, ఆ పాత్రకు అమితాబ్ సెట్ అవ్వడని..అమితాబ్ చేస్తే బాగోదని రజనీకాంత్ చెప్పడంతో శంకర్ వెనక్కి తగ్గాడట. రజినీకాంత్ చెప్పడంతో.. వేరే విలన్ కోసం ట్రై చేస్తే..చివరికి ఆ రోల్ అలా డ్యాన్ వద్దకు చేరిందట.
ఇక దీని పై అమితాబ్ స్పందిస్తూ.. ఓ ఇంటర్యూలో ఈ విషయాల పై క్లారిటి ఇచ్చాడు. నిజానికి రోబో మూవీ లో విలన్ పాత్ర చేయాలని డైరెక్టర్ శంకర్ సంప్రదించినప్పుడు.. రజనీ స్వయంగా తనకు ఫోన్ చేసి.. మీలాంటి వ్యక్తి విలన్ గా చేస్తే జనం రిసీవ్ చేసుకోలేరని..ఒప్పుకోవద్దని చెప్పేశారని.. దాంతో నో చెప్పానని చెప్పుకొచ్చారు.
నిజానికి మనం చూసిన్నట్లైతే..సినిమాకు హీరో ఎంత ముఖ్యమో.. విలన్ కూడా అంతే. అందుకే రాజమౌళి లాంటి దర్శకులు హీరో కంటే విలన్‌కు ఒక్కోసారి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తుంటారు. నెగిటివ్ కారెక్టర్స్ అంత పవర్ ఫుల్‌గా ఉంటాయి.