తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, ఫిల్మ్ క్రిటిక్, మోస్ట్ కాంట్రవర్సియల్ కత్తి మహేష్ ఇక లేరు. సినీ నటుడు, క్రిటిక్ కత్తి మహేశ్ మృతి చెందాడు. గత కొద్ది రోజుల క్రితం కత్తి మహేశ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం విదితమే. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహేశ్ మృతి చెందారు. ఈ మేరకు మహేశ్ మృతిని చెన్నై అపోలో ఆస్పత్రి వైద్యులు ధృవీకరించారు.
ఆంధ్రప్రదేశ్ నెల్లూరులోని చెన్నై – కలకత్తా రహదారిపై జూన్ 26న తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో కత్తి మహేశ్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. మహేశ్ తలకు తీవ్ర గాయాలు కావడంతో అతన్ని చికిత్స నిమిత్తం నెల్లూరులోని మెడికవర్ కార్పొరేట్ హాస్పిటల్‌కు తరలించారు.
మహేశ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై ఆయనకు చికిత్స కొనసాగుతున్నట్లు వైద్యులు తెలిపారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. కత్తి మహేష్ ట్రీట్మెంట్ ఖర్చుల కోసం జగన్ సర్కార్ 17 లక్షల భారీ ఆర్థిక సాయం విడుదల వేసింది. అక్కడే రెండు వారాలుగా కత్తి మహేష్‌కు చికిత్స జరుగుతుంది. తాజాగా ఆయన పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు.
జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరించిన ‘బిగ్ బాస్ సీజన్ 1’లో కత్తి మహేష్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ ద్వారా ఆయన సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించారు. అంతేకాకుండా తరచూ సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటూ ప్రేక్షకులను పలకరించేవారు. కత్తి మహేష్ మృతితో ఒక్కసారిగా అందరూ షాక్‌లోకి వెళ్లిపోయారు.