Moviesమన హీరోలకు బోర్ కొడితే ఏం చేస్తారో చూడండి..!!

మన హీరోలకు బోర్ కొడితే ఏం చేస్తారో చూడండి..!!

సినిమా పరిశ్రమలో హీరోలు తమ నటనతో ప్రేక్షకులను అలరిస్తు తమ అభిరుచులు పాటిస్తూ వారి జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తెలుగు చిత్ర పరిశ్రమ తెరపైకి చాలా మంది నవరసాలు పండిస్తూ తమ నటనతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు స్టార్ డాం వచ్చినప్పటికీ సామాన్య హీరోలాగే గడిపేస్తుంటారు. మన హీరో లు బోర్ కొట్టినప్పుడు ఏం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత డి రామానాయుడు తనయుడిగా నటవారసునిగా అడుగుపెట్టిన హీరో వెంక‌టేష్కి పాజిటివ్ థింకింక్, దైవ చింత‌న వెంకీకి ఎక్కువ‌గా ఉంటుంది. ఆయన ఎక్కువ‌గా పుస్త‌కాలు చదువుతుంటారట. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తన టాలెంట్ తో ప‌వ‌ర్ స్టార్ గా రేంజ్ కి ఎదిగారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కామ్ గా తన పని తను చేసుకోవడం, సింప్లిసిటీ గా ఉండటం, వ్యవసాయం చేయడం పుస్తకాలు చదవడం ఆయనకున్న మంచి లక్షణాలు. ఇక జూనియర్ ఎన్టీఆర్ సినిమాలలో కాకుండా పర్సనల్ గా ఎంతో ప్రశాంతంగా ఉంటూ పంచ్ డైలాగులతో జనాలను నవ్వు తెప్పిస్తాడట.

మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ వివాదాలకు దూరంగా ఉంటూ, బ‌య‌ట ఎక్కువగా కనిపించారట. ఇక తన పని తాను చేసుకుంటూ ఉంటాడట. మహేష్ బాబు బయట ఎంతో సీరియస్గా కనిపిస్తారు కానీ ఆయనలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ అని చెబుతారు. ఇంకా చాలామంది అలాగే రెబెల్ స్టార్ కృష్ణంరాజు నటవారసునిగా వచ్చి తన టాలెంట్ తో ఇంకా చెప్పాలంటే బాహుబలితో ఆల్ ఇండియాలో నే కాదు వరల్డ్ వైడ్ గుర్తింపు పాండియన్ ప్రభాస్.. చిత్ర పరిశ్రమలో చాలా మందితో ఫ్రెండ్లీగా ఉంటూ,త‌న ఇంటికి వ‌చ్చిన వారి స్వ‌యంగా వంట చేసి పెడుతుంటాడట

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news