Gossipsవెండితెరకు అల్లు అర్హ గ్రాండ్ ఎంట్రీ.. నిర్మాత ఎవరో తెలిస్తే మైండ్...

వెండితెరకు అల్లు అర్హ గ్రాండ్ ఎంట్రీ.. నిర్మాత ఎవరో తెలిస్తే మైండ్ బ్లాకే..!!

కుందనపు బొమ్మ అంటే అల్లు అర్జున్‌ గారాలపట్టి… క్యూటీ.. అర్హానే గుర్తొస్తుంది. అమ్మ స్నేహ, నాన్న అర్జున్‌తో.. ఆడుతూ అల్లరి చేస్తూ ఉండే ఈ అల్లు వారి బేబీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి చేత కుందనపు బొమ్మ అని అనిపించుకుంటుంది.

నిత్యం ఈ చిన్నారికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. గతంలో అల్లు అర్జున్ అర్హ కు సంబంధించిన వీడియోలు వైరల్ అయినా విషయం తెలిసిందే. తన ముద్దు ముద్దు మాటలతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది ఈ చిన్నారి.

సోషల్ మీడియాలో సెలబ్రిటీల పిల్లలకు ఉండే క్రేజే వేరు. తమ అభిమాన తారలతో సమానంగా వారిని ప్రేమిస్తుంటారు అభిమానులు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఎన్టీఆర్, అల్లు అర్జున్ పిల్లల ఫోటోలు వైరల్ అవుతుంటాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడానికి సినీ వారసులు చాలామంది ఉన్నారు. అయితే అందులో అబ్నాయిలే కాకుండా అమ్మాయిలు కూడా చాలామంది ఉన్నారు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ గారాల కూతురు అల్లు అర్హ కూడా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అది కూడా ఒక బడా నిర్మాతతో చేయబోతున్నట్లు సమాచారం.

ఇక ప్రస్తుతం మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం అల్లు అర్హ వెండితెరపై కూడా కనిపించబోతున్నట్లు టాక్ వస్తోంది. అయితే ఇప్పుడు బన్నీ తన కూతురు అర్హను చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అర్హను పెట్టి ‘అంజలి అంజలి’ వీడియో సాంగ్ ను రీక్రియేట్ చేశారు. ఈ వీడియోకి సోషల్ మీడియాలో భారీ వ్యూస్ వచ్చాయి.

ఇప్పుడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు పిల్లల కాన్సెప్ట్ తో ఓ సినిమా తీయబోతున్నారు. ఇందులో అల్లు అర్హను లీడ్ రోల్ లో తీసుకోవాలనుకుంటున్నారట.అయితే ఈ సినిమాలో అర్హతో పాటు అయాన్ కూడా కనిపిస్తాడేమో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే..!!

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news