అద్భుతమైన టైమింగ్, ఆకట్టుకునే హోస్టింగ్‌తో దాదాపు పదేళ్లుగా తెలుగు బుల్లితెరపై నెంబర్ వన్ మేల్ యాంకర్‌గా వెలుగొందుతున్నాడు ప్రదీప్ మాచిరాజు. తనదైన శైలి యాంకరింగ్‌తో సత్తా చాటుతోన్న అతడు.. వరుసగా ఆఫర్లు అందుకుంటూ దూసుకెళ్లిపోతున్నాడు.యాంకర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు ప్రదీప్ మాచిరాజు. ఎన్నో ప్రముఖ షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తోన్న ప్రదీప్. అడపాదడపా సినిమాల్లోనూ నటిస్తూ వస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు సైడ్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రదీప్ తొలిసారి హీరోగా మారి ‘ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాలో నటించాడు.
యాంకర్ ప్రదీప్ హీరోగా మారి చేసిన సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? సుకుమార్ శిష్యుడు మున్నా తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 29న విడుదలైంది. పునర్జన్మల నేపథ్యంలో సాగే ఈ సినిమాకు తొలిరోజే నెగిటివ్ టాక్ వచ్చింది. హీరోగా ప్రదీప్ బాగానే చేసాడు కానీ కథ ఆయనకు సహకరించలేదు అంటూ పెదవి విరిచారు ప్రేక్షకులు. మరోవైపు హీరోయిన్ అమృత అయ్యర్ మాత్రం అద్భుతంగా నటించింది అంటూ ప్రశంసలు దక్కాయి.
అయితే సినిమా విడుదల కాకముందు డిజిటల్ రిలీజ్ కోసం ఎన్ని ఆఫర్లు వచ్చినా కూడా ఈ సినిమా టీమ్ అందుకు నో అని చెప్పింది. అయితే ఈ సినిమాలో యాంకర్ ప్రదీప్ మన దేశం విషయానికి వస్తే. ఈ సినిమాలో ప్రమోషన్ భాగంగా ఈ సినిమా కోసం ఎలాంటి రెమ్యునరేషన్ నీ తీసుకోలేదని ప్రదీప్ తెలిపాడు. మొత్తానికి ఈ సినిమా బడ్జెట్ 4.5 కోట్ల రేంజ్ జరిగింది.
అయితే బిజినెస్ లెక్కల ప్రకారం గా ఈ సినిమా 10 కోట్ల రేంజ్ లో ఉండగా అందులో నుండి ప్రదీప్ 30 శాతం వరకు వెళ్తుందని అంటున్నారు. అంటే దాదాపుగా మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ వచ్చిందని చెప్పవచ్చు. సినిమాకి ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ అంటే మామూలు విషయం కాదు. మొదటి సినిమాతోనే జాక్ పాట్ కొట్టిన ప్రదీప్ నటుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు.