Moviesవైరల్ గా మారిన చరణ్ డేటింగ్ ఫోటో..ఉపాసన రియాక్షన్..!!

వైరల్ గా మారిన చరణ్ డేటింగ్ ఫోటో..ఉపాసన రియాక్షన్..!!

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తన చిన్ననాటి స్నేహితురాలు ఉపాసన కామినేనిని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2012 జూన్ 14న రామ్ చరణ్, ఉపాసన పెళ్లి జరిగింది. అప్పట్లో దేశమంతా మాట్లాడుకునేంత ఘనంగా ఈ పెళ్లి జరిపించారు ఇరు కుటుంబ సభ్యులు. ఉపాసన విషయానికొస్తే.. అపోలో హాస్పిటల్స్‌లోని అపోలో లైఫ్ విభాగానికి వైస్ చైర్మన్ బాధ్యతల్ని నిర్వర్తిస్తుంది. వీరిద్దరూ టాలీవుడ్ ఆదర్శ దంపతులలో ఒకరుగా ప్రశంసలు అందుకుంటూ ఉంటారు.

పెళ్లై తొమ్మిదేళ్లు అవుతున్న వీరిద్దరికి పిల్లలు లేరు. అదే వేరే హీరోల విషయానికొస్తే.. ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి తోటి హీరోలకు ఇద్దరేసి పిల్లలు ఉన్నా.. వీళ్లకు మాత్రం పిల్లలు లేరు. ఈ విషయమై టాలీవుడ్‌లో ఇప్పటికీ చాలా మంది డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ‌ అయితే రామ్ చరణ్-ఉపాసనల పెళ్లి, పిల్లలు అనేది వారి పర్శనల్ విషయాలు కాబట్టి.. వారిదే తుది నిర్ణయం.

ఫ్యామిలీతో సరదాగా గడపడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు చరణ్. ఏ మాత్రం విరామం దొరికినా ఫ్యామిలీ టూర్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తమ పెళ్లి రోజు సెలబ్రేషన్స్ కోసం చాలా సార్లు విదేశీ విహారయాత్రలకు వెళ్లి వచ్చిన ఈ కపుల్.. తాజాగా ఓ హోటల్‌లో లంచ్ డేట్‌కి వెళ్లి మెగా అభిమానులను కనువిందు చేశారు.

అయితే గత కొన్ని నెలలుగా లాక్ డౌన్ కారణంగా విరామం దొరికినా కోవిడ్ ఉదృతి ఉండటంతో ఇంటికే పరిమితమైన రామ్ చరణ్ దంపతులు.. ఇప్పుడు సరదాగా డేట్‌కి వెళ్లారు. వీకెండ్‌ కాకపోయినా ‘మిడ్‌ వీక్‌’ అంటూ బుధవారం రోజు ఓ రెస్టారెంట్‌ వెళ్లి లంచ్ చేశారు. ఈ విషయాన్ని ఉపాసన తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఇద్దరు కలిసి రెస్టారెంట్ లో దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలా చాలా కాలం గ్యాప్ తర్వాత డిన్నర్ చేయడంతో ఉపాసన ఎంతో సంతోషించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news