Moviesనాన్న మీద ప్రేమతో ఎన్టీఆర్ కొడుకు ఏం చేసాడో తెలుసా..??

నాన్న మీద ప్రేమతో ఎన్టీఆర్ కొడుకు ఏం చేసాడో తెలుసా..??

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈయనకు మంచి వ్యక్తిత్వం, డెడికేషన్, కష్టపడే తత్వం వల్ల సినిమాలన్నీ మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా ”ఆర్ఆర్ఆర్” సినిమా లో ఎన్టీఆర్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక త్వరలోనే ఎన్టీఆర్ ”ఎవరు మీలో కోటీశ్వరుడు” షో కూడా ప్రారంభం కానుంది.

ఎన్టీఆర్ ప్రణీత మే 5 -2009 లో వివాహం చేసుకున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు అభయ్ రామ్, భార్గవ్ రామ్ పేర్లతో ఇద్దరు కొడుకులు ఉన్నారనే సంగతి తెలిసిందే. అభయ్ చాలా సైలెంట్ అని భార్గవ్ రామ్ మాత్రం బాగా అల్లరి చేస్తారని గతంలో వార్తలు వచ్చాయి. ఇక అలానే ఎన్టీఆర్ కొడుకు కూడా సినిమాల్లోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇవ్వనున్నట్టు ఇటీవలే వార్తలు వచ్చాయ్.

అభయ్ రామ్, భార్గవ్ రామ్ లు కూడా నందమూరి వారసులుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి దుమ్మురేపనున్నారు. ప్రస్తుతం వారికీ సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయ్. ​అయితే తాజాగా ఒక వీడియో వైరల్ కాగా ఆ వీడియోలో అభయ్ రామ్ చేసిన అల్లరి అంతాఇంతా కాదు.

ఈ వీడియోలో అభయ్ రామ్ చేసిన అల్లరికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇసినిమాల్లో తారక్ విలన్లను చితకబాదతారనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సినిమాల్లో ఒకే దెబ్బతో కండలు తిరిగిన మనుషులను కూడా మట్టికరిపిస్తారు. సినిమా లో ఎటువంటి సీన్లు అయినా ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా అందించగలడు. ఇదంతా కేవలం సినిమాలలో మాత్రమే. అయితే తన ఇంట్లో మాత్రం తన పిల్లలతో ఎంత సరదాగా ఉంటారంటే.. తన కుమారుడి చేతిలో దెబ్బలు తినే అంతగా ఉన్నారు ఎన్టీఆర్.

ఎన్టీఆర్ మాత్రం తమ కుమారుడిని ఒక్క మాట కూడా అనుకోకుండా మౌనంగా దెబ్బలు తిన్నారు. కొడుకు అభయ్ రామ్ తారక్ పై చేతితో పంచ్ లు వేస్తుంటే తారక్ మాత్రం కొడుకును ఒక్క మాట కూడా అనకుండా దెబ్బలు తిన్నారుఇతన తండ్రిని పిడికిలి బిగించి ముఖం మీద బాక్సింగ్ ఆడుతున్నట్లు ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news