రాజమౌళి నుంచి ఏ సినిమా వచ్చినా సంచలనమే. దర్శకుడిగా మారి 20 ఏళ్ళ అవుతున్నా ఇప్పటికీ ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా జాగ్రత్త పడుతున్నాడు దర్శక ధీరుడు. స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి మొదలైన ప్రస్థానం బాహుబలితో వరల్డ్ లెవెల్ కి చేరుకున్న దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఏది చేసినా పక్కాగా చేస్తాడు. తాజాగా ఎన్టీఆర్,రామ్ చరణ్ లతో ఆర్. ఆర్ . ఆర్ మల్టీ స్టారర్ చేస్తున్నాడు.
అయితే ఆయన నుంచి వచ్చిన సంచలన సినిమా ఈగ. జక్కన్న తీసిన సినిమాల్లో ఇప్పటికీ మెస్మరైజ్ చేసే సినిమా ఈగ అని చెప్పాలి. రామ్ చరణ్ తో మగధీర లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత జక్కన్న నుంచి ఏ సినిమా వస్తుందా అని ఎదురుచూస్తున్న సమయంలో తీసిన ఈగ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది.
నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంతోనే అసలు సిసలు గ్రాఫిక్స్ మాయాజాలం ఎలా ఉంటోందో నేర్చుకున్నారు ఆయన. ఈగ లాంటి అల్ప జీవిని వెండితెరపై ఓ అద్భుత కథానాయకుడిగా మలచడం కోసం ఆయనెన్నో వ్యయ ప్రయాసలకోర్చారు. ఈగను యానిమేషన్‌లో సృష్టించడం ఒకెత్తైతే.. వాస్తవికతకు దగ్గరగా భావోద్వేగాలు పలికించగలగడం మరొకెత్తు.
దీన్ని సాధించడం కోసం తెర వెనుక రాజమౌళి బృందం పడిన కష్టం మామూలుది కాదు అయితే హీరో ని విలన్ చంపేస్తే,అతడు ఈగ రూపంలో జన్మించి పగ తీర్చుకోవడం ఇతివృత్తాన్ని చక్కగా మలిచాడు జక్కన్న. ఈ సినిమా తర్వాత జక్కన్న కోసం చాలామంది ప్రొడ్యూసర్స్ బ్లాంక్ చెక్కులతో సినిమా తీయాలని తిరిగారంటే అతడి ప్రతిభ ఏ రేంజ్ లో ఉందొ చెప్పొచ్చు.
ఈగ అనేది చిన్న ప్రురుగు.. చేతితో సులువుగా విదిలించికోగలం.. కానీ, అలాంటి జీవి మనిషి పై పగబడ్డితే.. ఆసక్తికరంగా ఉంటుందని భావించి రాజమోళి ఈ సినిమాను తీసాడట. అలా జులై 6, 2012న విడుదలైన ఈ చిత్రం విజయం సాధించింది. నాని, సమంత జంటగా నటించిన ఈ చిత్రంలో సుదీప్ విలనిజం అదుర్స్ అనిపించింది. ఈ సినిమా మొదటి రెండు రోజులు ఏమాత్రం కలెక్షన్స్ లేకపోవడంతో అందరూ పెట్టుకున్న బెంగ ఆతరువాత తీరిపోయింది.
ఒక్క ఈగతో చేసిన మెస్మరైజ్ ఆడియన్స్ బాగా ఆకట్టుకుంది. ఇక కీరవాణి ట్యూన్స్ షరా మూములే. ఓ కొత్త లోకంలో విహరిస్తున్న ఫీలింగ్ కల్పించి ఈగతో ఆడియన్స్ మనసు దోచిన జక్కన్న ఎలాంటి సినిమా తీసినా తిరుగులేదన్న గ్యారంటీ మరింత పెంచుకున్నాడు.