ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ సీనియర్లలో టాప్ హీరో నందమూరి బాలకృష్ణ. అలాగే తెలుగులో నటవారసుల్లో టాప్ హీరో అనిపించుకున్న తొలి హీరో కూడా. స్టార్ హీరో కొడుకుగా పుట్టినంత మాత్రాన స్టార్ కాలేరు. ఎదో ఒక ప్రత్యేకత, అందం, అభినయం లేకపోతే ప్రేక్షకులు హర్షించరు. అలాంటి ఓ లెజెండ్ నందమూరి తారకరామారాము కడుపున పుట్టి, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు నట సింహం బాలకృష్ణ.
1960 జూన్ 10న నందమూరి బసవ తారకం, నందమూరి తారక రామారావు ఎనిమిదో సంతానంగా జన్మించిన బాలకృష్ణ. ఎన్టీఆర్ దంపతులకు ఆరో కొడుకు, పద్నాలుగేళ్ల వయసులో తండ్రి ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తాతమ్మ కల’ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన నందమూరి బాలకృష్ణ. తొలినాళ్లతో సహాయ నటుడిగా తండ్రి చిత్రాల్లో నటించిన బాలకృష్ణ, తండ్రి ఎన్టీఆర్తో కలిసి 12 చిత్రాల్లో నటించిన బాలకృష్ణ. హీరో అయిన తర్వాత ఎన్టీఆర్ దర్శకత్వంలో శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, బ్రహ్మర్షి విశ్వామిత్రా చిత్రాల్లో నటించిన బాలయ్య.
కాకినాడకు చెందిన వసుంధరతో 1982లో వివాహాం అయింది. అసలు వీళ్ల వివాహానికి పునాది ఎలా పడిదంటే.. అప్పట్లో ఎన్టీఆర్ పాలిటిక్స్ లో బిజీ బిజీగా ఉన్నారట. మరోవైపు భార్య బసవ తారకం ఏమో కుమారుడికి పెళ్లి వయస్సు వచ్చేసిందని, త్వరగా పెళ్లి చేసేయాలని బాగా ఆరాట పడతుండేదంట.
భార్య పదే పదే ఒత్తిడి చేయడంతో.. పాలిటిస్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. బాలకృష్ణ కి మంచి అమ్మాయిని చూడమని .. అప్పట్లో టీడీపీలో ముఖ్య పాత్ర పోషించిన మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావుకు అమ్మాయిని చూసే బాధ్యతలనుఅప్పగించారు.
ఫైనల్ గా.. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన ఓ సంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయి వసుంధరను చూశారు. ట్రావెల్.. ట్రాన్స్ ఫోర్ట్ రంగంలో పేరున్న ఎస్ ఆర్ ఎం టీ చౌదరి అన్న కుమార్తే బాలయ్య భార్య వసుంధర. ఇక అప్పట్లోనే వసుంధర ఫ్యామిలీ బాలయ్యకు కట్నంగా రు. 10 లక్షలు ఇచ్చారట. అయితే ఈ విషయాన్ని నాదెండ్ల స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఇప్పుడు బాలయ్య వసుంధరలకు బ్రాహ్మణి, తేజిస్వి, ఇద్దరు కూతుళ్లతో పాటు కుమారుడు మోక్షజ్ఞ ఉన్నాడు. బ్రాహ్మణిని చంద్రబాబు తనయుడు లోకేష్ కిచ్చి వివాహం చేయగా, రెండో కూతురిని విశాఖకు చెందిన భరత్ కు ఇచ్చి చేసాడు.