నిరుపమ్ పరిటాల.. ఈ పేరు చెప్పితే చాలా మందికి పెద్దగా తెలియకపోవచ్చు. అదే డాక్టర్ బాబు అని చెప్పితే టక్కున గుర్తుపట్టేస్తారు. అంతలా డాక్టర్ బాబు పేరుతో ఫేమస్ అయ్యడు బుల్లితెర హీరో నిరుపమ్ పరిటాల. బుల్లితెర ప్రేక్షకులకు నిరుపమ్ పరిటాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. నిరుమప్ ఇప్పుడు బుల్లితెర శోభన్ బాబులా మారిపోయారు. కార్తీకదీపం సీరియల్తో అందరి హృదయాల్లో డాక్టర్ బాబుగా గుర్తింపు పొందారు.
ఈయన ఇప్పుడు ఎంత బిజీగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చంద్రముఖి సీరియల్తో గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. ఆ తర్వాత కార్తీక దీపంతో నెంబర్ వన్ అయిపోయాడు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో డాక్టర్ బాబు అంటే తెలియని వాళ్లు ఉండరు. అంతటి క్రేజ్ సంపాదించుకున్నారు నిరుపమ్.
ఇక నిరుపమ్ మీద సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. నిరుపమ్ భార్య మంజుల కూడా బుల్లితెరపై సుపరిచితులే. ఆమె కూడా సీరియల్ నటిగా ఎన్నో సీరియల్స్ లో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది.
మంజుల ఇంటర్ చదువుతున్న సమయంలో ఆమె నాన్న స్నేహితుడు ఒక సీరియల్ హీరోయిన్ కోసం వెతుకుతుండగా ఆ సీరియల్ ఆడిషన్స్ కి వెళ్లారు. అక్కడ ఆమెను చూసిన సీరియల్ యూనిట్ సభ్యులు ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేసారు. అయితే మంజుల చదువు కొనసాగిస్తూనే ఏకంగా అయిదు కన్నడ సీరియల్స్ లో నటించి.. నటన పట్ల తనకు ఉన్న ఇంట్రస్ట్ ఏంటో అందరి అర్ధం అయ్యేలా చేసింది.
ఆ తర్వాత తెలుగు సీరియల్ చంద్రముఖి లో ఛాన్స్ దక్కించుకున్న మంజుల ఈ సీరియల్ షూటింగ్ సమయంలోనే నిరుపమ్ తో ప్రేమలో పడ్డారు. చంద్రముఖి సీరియల్తో ఈ ఇద్దరి ప్రయాణం మొదలైంది. ఆ ధారవాహికతో కెరీర్ మొదలవ్వడమే కాకుండా.. లవ్ కూడా మొదలైంది. అలా చంద్రముఖి సీరియల్ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అనంతరం ఇద్దరూ వివాహాం చేసుకున్నారు. ఇక ఇద్దరూ కూడా తమ తమ సీరియళ్లతో బిజీగా ఉన్నారు.