Moviesఅలా మాకు ఇష్టం లేదు.. మెగావారసుడు పై ఉపాసన షాకింగ్ కామెంట్స్..!!

అలా మాకు ఇష్టం లేదు.. మెగావారసుడు పై ఉపాసన షాకింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తన చిన్ననాటి స్నేహితురాలు ఉపాసన కామినేనిని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2012 జూన్ 14న రామ్ చరణ్, ఉపాసన పెళ్లి జరిగింది. అప్పట్లో దేశమంతా మాట్లాడుకునేంత ఘనంగా ఈ పెళ్లి జరిపించారు ఇరు కుటుంబ సభ్యులు. ఉపాసన విషయానికొస్తే.. అపోలో హాస్పిటల్స్‌లోని అపోలో లైఫ్ విభాగానికి వైస్ చైర్మన్ బాధ్యతల్ని నిర్వర్తిస్తుంది. వీరిద్దరూ టాలీవుడ్ ఆదర్శ దంపతులలో ఒకరుగా ప్రశంసలు అందుకుంటూ ఉంటారు.

పెళ్లై తొమ్మిదేళ్లు అవుతున్న వీరిద్దరికి పిల్లలు లేరు. అదే వేరే హీరోల విషయానికొస్తే.. ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి తోటి హీరోలకు ఇద్దరేసి పిల్లలు ఉన్నా.. వీళ్లకు మాత్రం పిల్లలు లేరు. ఈ విషయమై టాలీవుడ్‌లో ఇప్పటికీ చాలా మంది డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ‌ అయితే రామ్ చరణ్-ఉపాసనల పెళ్లి, పిల్లలు అనేది వారి పర్శనల్ విషయాలు కాబట్టి.. వారిదే తుది నిర్ణయం.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఉపాసన దీనిపై స్పందించారు. “ఇది మన జీవితంలో చాలా ముఖ్యమైనది. పిల్లలు 20 సంవత్సరాల ప్రేమ ప్రాజెక్ట్.. దానికి అవసరమైన జ్ఞానాన్ని పొందుతున్నాము. మా పిల్లలను అర్ధహృదయంతో పెంచడం మాకు ఇష్టం లేదు. ఈ గ్రహంలోకి ఒకరిని తీసుకువస్తుంటే మీ చుట్టూ ఉన్న అన్ని పరిస్థితుల గురించి తెలుసుకోవాలి”అని తెలిపారు.

 

ఒకప్పుడు దీని పై చిరంజీవి కూడా మాట్లాడుతూ.. “నిజమైన వారసుడ్ని ఎత్తుకోవాలని నాకూ ఉంది. నా భార్య సురేఖ.. చరణ్-ఉపాసనలను అడుగుతూనే ఉంది. కాని వాళ్ల పిల్లల ప్లానింగ్ ఏంటో మాకూ అర్థం కావడం లేదు. అది వాళ్ల పర్శనల్ విషయం.. అందులో మనం ఎంత వరకూ చెప్పాలో అంతవరకే చెప్పగలం. తరువాత వాళ్ల ఇష్టం” అంటూ చెప్పుకొచ్చారు చిరంజీవి. ఇక రాంచరణ్ ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం చేస్తున్నాడు..! ఈ చిత్రం షూటింగ్.. పూర్తైన తరువాత తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రంలో కూడ చరణ్ నటించబోతున్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news