1990వ దశకంలో స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి – స్టార్ హీరోయిన్ విజయశాంతి ఏ సినిమాలో జంటగా నటించినా పోటాపోటీగా నటించేవారు. వీరిద్దరు దశాబ్ద కాలంగా స్టార్ స్టేటస్ అనుభవించాక 1991లో గ్యాంగ్ లీడర్ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు రికార్డులు తిరగరాసింది. అయితే అప్పట్లో చిరంజీవి ఘరానా మొగుడు సినిమాకు తొలి సారిగా రు. కోటి రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఈ సినిమా 1992లో రిలీజ్ అయ్యింది. చిరంజీవి తొలిసారిగా కోటి రెమ్యునరేషన్ తీసుకున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం.
అయితే చిరు అప్పట్లో తిరుగులేని స్టార్ డమ్‌తో ఉన్నారు. అయితే చిరు కంటే ముందే విజయశాంతి ఓ సినిమాకు రు. కోటి రెమ్యునరేషన్ తీసుకోవడం అప్పట్లో సంచలనం. ఆ సినిమా ఏదో కాదు కర్తవ్యం. ఏఎం. రత్నం నిర్మించిన ఈ సినిమా కిరణ్ బేడీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కగా.. విజయశాంతి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ఈ సినిమాతో మొదటి సారిగా విజయశాంతి ఉత్తమ జాతీయ నటి అవార్డు కూడా అందుకుంది.
1990వ సంవత్సరం జూన్ 29వ తేదీన విడుదలైన కర్తవ్యం రు. కోటి తో తెరకెక్కగా.. రు. 7 కోట్ల షేర్ రాబట్టింది. దీంతో అప్పటి వరకు విజయశాంతికి పర్సనల్ మేకప్‌మెన్‌గా పని చేసిన రత్నం ఆమెకు రెమ్యురేషన్‌గా రు. కోటి ఇచ్చారు. ఆ తర్వాత సంవత్సరం చిరు రు. కోటి రెమ్యునరేషన్ అందుకున్నారు. ఇది అప్పట్లో ఓ సంచలనం అయ్యింది.