పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మాణంలో కృష్ణవంశీ దర్శకత్వంలో విడుదలైన కుటుంబకథా చిత్రం “గోవిందుడు అందరివాడేలే”. ఇండస్ట్రీలో భారీ అంచనాల నడుమ విడుదలై ఆ తరువాత ఊహించని రిజల్ట్ ను అందుకున్న సినిమాల్లో గోవిందుడు అందరివాడేలే. ఈ సినిమాలో రాం చరణ్ తేజ, శ్రీకాంత్, కాజల్ అగర్వాల్, కమలినీ ముఖర్జీ కథానాయక-నాయికలుగా నటించారు. భానుశ్రీ మెహ్రా, ప్రకాష్ రాజ్, జయసుధ, రహమాన్, ఆదర్శ్ బాలకృష్ణ ముఖ్యపాత్రల్లో నటించారు.
ఈ చిత్రకథను పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ రచించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. ఈ సినిమా కమర్షియల్ కలెక్షన్స్ ను చాలా విబిన్నంగా అందుకుంది. ఈ సినిమా కథకు పాక్షికంగా అక్కినేని నాగేశ్వరరావు, మీనా కలిసి నటించిన సీతారామయ్య గారి మనవరాలు స్ఫూర్తి.
అసలు గోవిందుడు అందరివాడేలే కథ సినిమాగా రావడానికి మొదటి బీజం అక్కినేని వారి వల్లే జరిగిందట. మనం సినిమా కంటే ముందే అక్కినేని మూడు తరాల కోసం ఒక సినిమా చేయాలని నాగార్జున చెప్పగానే కృష్ణవంశీ ఆ కథను సెలెక్ట్ చేసుకున్నడు. అయితే కథ ఫస్ట్ బాగునప్పటికి సెకండ్ హాఫ్ పై నాగ్ అంతగా ఇంట్రెస్ట్ చూపలేదు.
దీంతో గోవిందుడు అందరివాడేలే సినిమా కథను చిరంజీవికి వినిపించినప్పుడు వెంటనే ఒప్పేసుకొని రామ్ చరణ్ ను ఫిక్స్ చేశారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. గోవిందుడు అందరివాడేలే సినిమాలో శ్రీకాంత్ పాత్ర చేయడానికి ముందు విక్టరి వెంకటేష్ అనుకున్నారట. అందుకు వెంకీ మామ కూడా గ్రీన్ సిగనల్ ఇచ్చాడట వెంకటేష్ కూడా ఒప్పేసుకున్నాడుట. కానీ చివరి నిమిషంలో ఆయన ఆ పాత్రకు అంతగా సెట్టవ్వడని వద్దనుకున్నారట. ఏదేమైనా గోవిందుడు అందరివాడేలే సినిమా అటు తిరిగి ఇటు తిరిగి అలా చివరకు రామ్ చరణ్ వైపు తిరిగింది.