Moviesఆ హీరోయిన్‌కు ప్రెగ్నెన్సీ.. బిడ్డ‌కు తండ్రి ఎవ‌రో బిగ్ స‌స్పెన్స్‌..!

ఆ హీరోయిన్‌కు ప్రెగ్నెన్సీ.. బిడ్డ‌కు తండ్రి ఎవ‌రో బిగ్ స‌స్పెన్స్‌..!

అమెరికాలోని చికాగోకు చెందిన 25 ఏళ్ల మాజీ అడల్ట్‌ స్టార్‌ లానా రోడ్స్ సంచ‌ల‌న విష‌యం వెల్ల‌డించింది. ఆమె అస‌లు పేరు అమరా మాపుల్‌. అయితే చిన్న వ‌య‌స్సులోనే పోర్న్ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టి లానా రోడ్స్‌గా పాపుల‌ర్ అయ్యింది. 2016లో అడ‌ల్ట్ సినిమాల్లోకి వ‌చ్చిన ఆమె రెండేళ్ల‌లోనే తిరుగులేని పోర్న్ స్టార్ట్ అయ్యింది. ఆ త‌ర్వాత ఆ కెరీర్‌ను వ‌దులుకున్న ఆమె హ్యారీ జోసే పాడ్‌కాస్ట్‌ టాప్‌ ఇన్ లో ప‌ని చేస్తూ ఇండ‌స్ట్రీ టార్గెట్‌గా త‌ర‌చూ విమ‌ర్శ‌లు చేస్తోంది.

ఇదిలా ఉంటే ఆమె మ‌రో బాంబ్ పేల్చింది. తాను ప్ర‌స్తుతం ప్రెగ్నెంట్ అని.. తన బిడ్డ‌కు త‌న పోర్న్ జీవితం గురించిన విష‌యం తెలియ‌కూడ‌ద‌ని.. అందుకే ఆ సైట్ల‌లో ఉన్న వీడియోలు అన్ని తొల‌గించాల‌ని కోరింది. తాను భ‌విష్య‌త్తులో త‌న గౌరవం కాపాడుకోవాల‌ని అనుకుంటున్నానంటూ ఆమె విజ్ఞ‌ప్తి చేసింది. ఇదిలా ఉంటే ఆమెకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఎవ‌రి ద్వారా వ‌చ్చింద‌న్నది స‌స్పెన్స్‌గా ఉంది. దీనిపై మీడియాలో కూడా ర‌క‌ర‌కాల గాసిప్‌లు వ‌స్తున్నాయి.

అమెరిక‌న్ న‌టుడు, పాపుల‌ర్ వ్లోగ‌ర్ మైక్ మ‌జ్ ల‌క్‌తో ఆమె చాలా కాలం స‌హ‌జీవ‌నం చేస్తోంద‌న్న వార్త‌లు ఉన్నాయి. అయితే కొద్ది నెల‌ల క్రిత‌మే వీరిద్ద‌రు విడిపోయారు. లానా కడుపులో బిడ్డకు తండ్రి అతనేనా ? అనే అనుమానం ఆమె అభిమానులకు వ్యక్తం అవుతోంది. దీనిపై కొంద‌రు నెటిజ‌న్లు ఆమెను సోష‌ల్ మీడియాలో ప్ర‌శ్నిస్తే బిడ్డ పుట్టాక డీఎన్ ఏ టెస్టు చేస్తే తెలుస్తుంద‌ని కొంటెగా స‌మాధానం ఇస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news