సోనూ సుద్ కరోనా వచ్చాక భారతదేశ ప్రజలకు దేవుడు అయిపోయాడు. కరోనా ఫస్ట్ వేవ్ నుంచి సోనూ ఎవరు ఎక్కడ కష్టాల్లో ఉన్నా వారికి సేవలు అందిస్తూ వచ్చాడు. సోనూ సోషల్ మీడియా ఖాతాకు ఎవరి ఇబ్బంది అయినా ట్యాగ్ చేస్తే చాలు.. రెండు, మూడు రోజుల్లోనూ సోనూ ఆ ఇబ్బందిని పరిష్కరించి దేవుడు అయిపోయాడు. సోనూ సేవలపై రాజకీయ పార్టీల నుంచి సైతం ఎన్నో విమర్శలు వచ్చాయి. అయినా సోనూ వాటిని పట్టించుకోలేదు.
ఇక కరోనా సెకండ్ వేవ్‌లో కూడా సోనూ ఎన్నో బృహత్తర సేవా కార్యక్రమాలు చేశాడు. సెకండ్ వేవ్ తీవ్రమైన మరణహోమం సృష్టిస్తున్నా కూడా సోనూ సేవలకు మాత్రం బ్రేకులు లేవు. దేశ వ్యాప్తంగా 400 మందితో ఓ నెట్ వర్క్ ఏర్పాటు చేసుకుని మరీ సోనూ తన చేతికి ఎముక లేదన్న చందంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఎంతో మందిని ఆదుకున్నాడు. సోనూను ఇప్పుడు అందరూ దేవుడిగా కొలుస్తున్నారు. లాక్ డౌన్ వేళ సోను చేసిన సాయానికి వెలకట్టలేం.
ఇక సోనూకు సోషల్ మీడియాలో తిరుగులేని క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలో మనోడి ఫాలోవర్స్ సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. పెద్ద పెద్ద బడా హీరోలకు లేని క్రేజ్ మనోడి సొంతం. సోనూ ఇన్ స్టాలో అతడిని అనుసరిస్తోన్న వారి సంఖ్య ఏకంగా 12 మిలియన్లు. చాలా తక్కువ టైంలో ఈ రేంజ్ ఫాలోవర్స్ అంటే మామూలు విషయం కాదు. ఏదేమైనా సోనూ సేవకు ఫిదా అవుతోన్న వారి అతడి సోషల్ మీడియా సైన్యంలో జాయిన్ అయిపోతున్నారు.