సూపర్ స్టార్ మహేష్‌బాబు నటించిన సినిమాలు గ్రేటర్ హైదరాబాద్‌లో ఎన్నో సంచలనాలు క్రియేట్ చేశాయి. మహేష్ యావరేజ్, ప్లాప్ సినిమాలు సైతం గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు సెంటర్లలో 100 రోజులు ఆడాయి. ఇక దిల్‌షుక్ నగర్లో మహేష్ నటించిన నాలుగు సినిమాలు 10 రోజుల పాటు 4 ఆటలతో హౌస్ ఫుల్ అయ్యాయి. నిజం సినిమా కోణార్క్, మురారి రాజధాని థియేటర్లో, ఒక్కడు కోణార్క్, పోకిరి మెఘాలో 10 రోజుల పాటు 4 ఆటలతో హౌస్ ఫుల్ అయ్యి అప్పట్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాయి. దిల్‌సుఖ్ నగర్ సెంటర్ అంటే మహేష్ సినిమాలకు అడ్డాగా మారిపోయింది.
దీంతో దిల్‌సుఖ్ నగర్ ఏరియా మహేష్ అభిమానులు ఆ ప్రాంతానికి మహేష్ నగర్ అన్న పేరు ముద్దుగా పెట్టేసుకున్నారు. మహేష్ సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు ఆ ప్రాంతం అంతా రెండు, మూడు రోజుల పాటు పెద్ద సందడితో ఉంటుంది. రిలీజ్ రోజు అయితే ఫ్యాన్స్‌కు పెద్ద పండగే అని చెప్పాలి. అలాగే కూకట్‌పల్లి ఏరియాలతో పాటు ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సైతం మహేష్ సినిమాలు 100 రోజులు, 175, 200 రోజులు ఆడి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాయి.
#Okkadu Konark 1st week Gross 8,14,100/-
ATR sharing with Indra
14 Days 4 shows HFs
121 Days Run
Closing Gross 77L+
All time DSNR record#Nijam Konark 1st week Gross 9,01,180/- ATR
10 Days 4 Shows HFs
32D G 25,11,021/-
50 Days Run Closing 32L+ 👌Murari 11D 4 shows HFs pic.twitter.com/RRvRAWDZ5e
— Gautam🔔 (@VintageMBfan) June 25, 2021