ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరే కాకుండా దంపతులు సైతం భౌతిక దూరం పాటించాలని సూచనలు వస్తున్నాయి. అయితే తాజాగా బ్రిటన్ ప్రభుత్వం శృంగారంపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం సంచలనమైంది. లండన్ టూటైర్, త్రి టైర్ నగరాల్లో ఉన్న వ్యక్తులు లేదా ఎక్కువ రోజులు సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తులు, జంటలు ఇంట్లో లేదా బయట ఎక్కడ అయినా కలుసుకున్నప్పుడు ఆరు అడుగుల మేర భౌతిక దూరం పాటించాల్సిందే అని మార్గదర్శకాల్లో పేర్కొంది.
బ్రిటీష్ ప్రజలు ఎలాంటి లైంగిక సంబంధాలకు ఆసక్తి చూపవద్దని కూడా ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఇక జంటలు, యువతీ, యువకులు సహజీవనం చేస్తున్నా కూడా భౌతిక దూరం పాటించాల్సిందే అంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. లైంగీక సంబంధాలపై ఆంక్షలు విధించే భక్కు ప్రభుత్వానికి లేదని ప్రజల నుంచి విమర్శలు వస్తున్నా ప్రభుత్వం మాత్రం ఆంక్షల విషయంలో వెనక్కు తగ్గడం లేదు.