పూజాహెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల ఏకైక ఆప్షన్. ప్రస్తుతం ఏ స్టార్ హీరో నోట విన్నా, ఏ స్టార్ డైరెక్టర్ నోట విన్నా పూజా హెగ్డే పేరే ప్రధానంగా వినిపిస్తోంది. తమ సినిమాకు మార్కెట్లో క్రేజ్ ఉండాలంటే పూజనే ఖచ్చితంగా హీరోయిన్గా ఉండాలని కోరుకుంటున్నారు. స్టార్ హీరోల నుంచి మీడియం రేంజ్ హీరోల వరకు అందరూ పూజానే కోరుకుంటున్నారు.
దీంతో ఆమె కొండెక్కి కూర్చొంటోంది. అటు బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు తన్నుకొస్తున్నాయి. లాక్ డౌన్ తరువాత అంతా తమ రెమ్యునరేషన్ తగ్గించేస్తుంటే పూజ మాత్రం ఏకంగా 3 కోట్లకు పెంచేసింది. బాలీవుడ్లో అయితే ఏకంగా సల్మాన్ ఖాన్ సినిమా కోసం ఆమెకు ఆఫర్ వచ్చింది. ఇక రణవీర్ సింగ్ సినిమాలోనూ ఆమెనే హీరోయిన్గా తీసుకోవాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పూజా ఒక్కో సినిమాకు తెలుగులో రు. 3 కోట్లకు తగ్గేది లేదని చెపుతోంది.
ఇక ప్రస్తుతం తెలుగులో రాధే శ్యామ్, అఖిల్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాలతో పాటు మరో నాలుగైదు ఆఫర్లు రెడీగా ఉన్నాయి. అయితే ఆమె చెపుతోన్న రు. 3 కోట్ల రేటు చూసి దర్శక, నిర్మాతలు ఆమెకు ఆమె రేటుకు ఓ దండం బాబోయ్ అంటున్నారు.