అక్కినేని నాగార్జున వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని అఖిల్. తొలి సినిమా అఖిల్ డిజాస్టర్.. రెండో సినిమా హలోను సొంతంగా భారీ బడ్జెట్‌తో నిర్మించారు.. కాస్ట్ ఫెయిల్యూర్.. మూడో సినిమా మిస్టర్ మజ్ను లవ్ స్టోరీగా చేసినా ప్లాప్ అయ్యింది. దీంతో రెండేళ్లు గ్యాప్ తీసుకుని ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తున్నాడు.
అసలే బొమ్మరిల్లు భాస్కర్‌ను జనాలు మర్చిపోయారు. ఇక అల్లు అరవింద్ ఆధ్వర్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. నాగార్జున ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఇక తన సినిమాల హిట్ కోసం అఖిల్ ప్రధానంగా సెంటిమెంట్‌నే నమ్ముకున్నట్టు తెలుస్తోంది. వరుస హిట్లతో ఉన్న పూజా హెగ్డేను పట్టుబట్టి మరీ తన సినిమాలో హీరోయిన్గా తీసుకున్నాడు. అఖిల్ మార్కెట్‌తో పోలిస్తే ఆమెను తీసుకుంటే బడ్జెట్ కాస్ట్ ఎక్కువ అవుతుందని నిర్మాతలు చెప్పినా అఖిల్ ఆమే కావాలని పట్టుబట్టి మరీ హీరోయిన్గా తీసుకున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయబోయే స్పై థ్రిల్లర్ లో రష్మికను తీసుకుంటున్నాడు. అఖిల్ పట్టుబట్టి మరీ రష్మికను సెలక్ట్ చేశాడని తెలుస్తోంది. కేవలం హిట్ హీరోయిన్లు, క్రేజీ హీరోయిన్లు ఉంటే చాలు సినిమా హిట్ అవుతుందనే అఖిల్ భావిస్తున్నాడు. అయితే అన్ని సందర్భాల్లోనూ హిట్ హీరోయిన్లు ఉంటేనే సినిమా హిట్ అవ్వదు కథ, కథనాలు, డైరెక్షన్, నటన కూడా ఉండాలన్న విషయం అఖిల్ తెలుసుకుంటేనే మంచిదని కూడా పలువురు సూచిస్తున్నారు. హిట్ కోసం అఖిల్ నమ్ముకున్న సెంటిమెంట్‌ను చూసి పాపం అఖిల్ అనుకోక తప్పదేమో..!