కోలీవుడ్ క్రేజీ కపుల్ త్రిష – శింబు మధ్య ప్రేమాయణం గత పదేళ్లుగా వార్తల్లో నానుతూనే ఉంది. వీరిద్దరు కెరీర్ పరంగా పీక్స్‌లో ఉన్నప్పుడు ప్రేమలో పడ్డారు. వీరు పెళ్లి చేసుకుంటారు అనుకున్న టైంలోనే వీరి మధ్య గ్యాప్ రావడంతో ఎవరి దారులు వారివి అయ్యాయి. ఆ తర్వాత త్రిష సిద్ధార్థ్, రానాతో ఎఫైర్ నడిపిందన్న గాసిప్‌లు వచ్చాయి. ఇక శింబు నయనతారతో పాటు హన్సిక, మరో ఒకరిద్దరు హీరోయిన్లతో చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు. ఇక త్రిషకు పారిశ్రామికవేత్త వరుణ్ మణియన్‌తో ఎంగేజ్మెంట్ అయ్యాక తేడా రావడంతో విడిపోయారు.
అనూహ్యంగా ఇటు శింబు ప్రేమాయణాలు కూడా బ్రేకప్ అవ్వడంతో ఇప్పుడు మళ్లీ త్రిష – శింబు కలిసిపోయారు. ఈ జంట మళ్లీ ప్రేమలో పడిందని.. పెళ్లి చేసుకోవచ్చని కోలీవుడ్ మీడియా రాస్తోంది. ఈ వార్తలపై స్పందించమని శింబు తండ్రి రాజేందర్‌ను అడిగితే ఆయన మీడియాపై ఫైర్ అయ్యారు. అయితే త్రిష – వరుణ్ మణియన్ జంట పెళ్లి ఆగిపోవడానికి ప్రధాన కారణం ఓ టాప్ హీరో అంటూ అప్పట్లో ప్రచారం కూడా జరిగింది.
అయితే ఇప్పడు శింబు షార్ట్ టెంపర్ పూర్తిగా తగ్గించుకుని కెరీర్‌పై కాన్షంట్రేషన్ చేయడానికి ప్రధాన కారణం త్రిషే అంటున్నారు. శింబును త్రిష చాలా వరకు మార్చిందని.. అతడికి దగ్గరవుతోందని.. అందుకే లాక్డౌన్ టైంలో వీరిద్దరు కలిసి గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ షార్ట్ ఫిల్మ్‌లో నటించారని అంటున్నారు. ఏదేమైనా మళ్లీ త్రిష – శింబు కలిసి పోవడంతో వీరి పెళ్లి జరుగుతుందని వీరిద్దరి అభిమానులు హ్యాపీగా ఉన్నారు. మరి వీరు ఏం చేస్తారో ? చూడాలి.