బెజవాడలో రెండు రోజుల క్రితమే ప్రేమను తిరస్కరించిందన్న కారణంతో ఓ నర్సును రోడ్డుమీదే ప్రేమోన్మాది చంపేసిన ఘటన మరువక ముందే ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని ఓ ప్రేమోన్మాది ఇంటికి వెళ్లి మరీ చంపేశాడు. విజయవాడలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థిని దివ్య తేజస్విని.. స్థానికుడైన స్వామి ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అయితే ఆ యువతి అతడి ప్రేమను తిరస్కరిస్తోంది. స్వామి పెయింటర్‌గా పని చేస్తున్నాడు.
ఈ క్రమంలోనే గురువారం యువతి ఇంటికి వెళ్లిన స్వామి ఆమెతో ఘర్షణ పడి తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. తేజస్విని మొడపై గాయం కావడంతో ఆమెను ముందు స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు.
ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. యువతిపై దాడి చేసిన తర్వాత.. ఉన్మాది కూడా తనను తాను కత్తితో గాయపర్చుకున్నాడు. దీంతో ప్రేమోన్మాది స్వామిని కూడా జీజీహెచ్‌కే తరలించగా అతడు అక్కడ చికిత్స పొందుతున్నాడు.