కరోనా వల్ల మూతపడిన థియేటర్లు అక్టోబర్ 15 నుంచి కొన్ని షరతులతో తెరచుకోనున్నాయి. ఇప్పటికిప్పుడు పెద్ద సినిమాలు రిలీజ్ కాకపోయినా దసరాకో లేదా సంక్రాంతికి అయినా పెద్ద సినిమాలు వస్తాయి. ఇక పవన్ కళ్యాణ్ నటిస్తోన్న వకీల్‌సాబ్ సమ్మర్‌కు రావాల్సి ఉండగా ఇది ఏకంగా సంక్రాంతికి వెళ్లిపోయింది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాలీవుడ్ హిట్ మూవీ పింక్‌కు రీమేక్‌గా వస్తోంది.
ఇక సంక్రాంతికే కేజీఎఫ్ 2 కూడా వస్తోంది. సంక్రాంతి రోజున ఈ పాన్ ఇండియా సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు తెలుగు ట్రేడ్ వర్గాలతో పాటు పవన్ అభిమానులను ఓ ప్రశ్న వేధిస్తోంది. వకీల్‌సాబ్ కేజీఎఫ్ 2ను తట్టుకుని నిలబడుతుందా ? అన్నదానిపై అనేక సందేహాల ఉన్నాయి. కేజీఎఫ్ ఏకంగా నేషనల్ వైడ్‌గా పాపులర్ అవ్వడంతో పాటు అన్ని భాషల్లోనూ ఆడింది. మరి ఇప్పుడు ఆ సినిమాకు రెండో పార్ట్‌గా వస్తోన్న కేజీఎఫ్ 2పై లెక్కకు మిక్కిలిగా అంచనాలు ఉన్నాయి.
ఈ రెండు సినిమాలు సంక్రాంతికే వస్తే రెండు సినిమాలు బాగుంటే వకీల్‌సాబ్ కంటే కేజీఎఫ్ 2కు కాస్త అడ్వాంటేజ్ ఉంటుందంటున్నారు. రెండు సినిమాల్లో ఏ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఖచ్చితంగా రేసులో వెనకపడిపోతుంది. మరి వకీల్‌సాబ్ వర్సెస్ కేజీఎఫ్ 2 వార్‌లో ఎవరు పైచేయి సాధిస్తారో ? చూడాలి.