Moviesహిట్ హీరోయిన్ అమ్మ అవుతోందిగా..

హిట్ హీరోయిన్ అమ్మ అవుతోందిగా..

ఒకే ఒక్క సినిమాతో సౌత్‌లో సూప‌ర్ పాపుల‌ర్ అయిన ఆ అమ్మ‌డు ఇప్పుడు అమ్మ అవుతోంది. ఈ విష‌యాన్ని ఆమె త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. తేజ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన నువ్వు నేను సినిమాతో హీరోయిన్ అయిన ఆమె ఆ ఒక్క సినిమాతోనే కావాల్సినంత క్రేజ్ తెచ్చుకుంది. ఆ త‌ర్వాత సౌత్ టు నార్త్ ప‌లు భాష‌ల్లో హీరోయిన్‌గా న‌టించింది. అయితే ఆమెకు వ‌చ్చిన క్రేజ్‌తో పోలిస్తే ఆమెకు స‌రైన గుర్తింపు రాలేదు.

Faded Heroine Still Earns Huge | Anitha | Telugu Heroine | TV Serials  Actress

ఆ త‌ర్వాత ఆమె కార్పొరేట్ ప్రొఫెష‌న‌ల్ రోహిత్‌రెడ్డిని పెళ్లి చేసుకుని సినిమాల‌కు గుడ్ బై చెప్పేసి దాంప‌త్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఆమె సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మై ఓ షాకింగ్ న్యూస్‌తో అంద‌రిని స‌ర్‌ఫ్రైజ్ చేసింది. త్వ‌ర‌లో తాను అమ్మ కాబోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆమె ట్విట‌ర్‌లో విడుద‌ల చేసిన వీడియోకు నెటిజ‌న్లు ప్ర‌శంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

Nuvvu Nenu actress to become a mom soon

ఇక త‌న భ‌ర్త రోహిత్ రెడ్డితో ఆమె ప్రేమ స్టిల్స్‌, వీడియోలు చూపిస్తూ అనిత ఫుల్ ఖుషీ అవుతున్నారు. రోహిత్‌రెడ్డితో ఏడ‌డుగులు వేసిన మొద‌లుకుని ఇప్ప‌టి వ‌ర‌కు త‌మాషాగా సాగిన ప్రేమ ప్ర‌యాణాన్ని ఆ వీడియోలో ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news