Politicsఏపీ అసెంబ్లీలో తండ్రి, కొడుకు, అల్లుడు... ముగ్గురూ వైసీపీ ఎమ్మెల్యేలే..

ఏపీ అసెంబ్లీలో తండ్రి, కొడుకు, అల్లుడు… ముగ్గురూ వైసీపీ ఎమ్మెల్యేలే..

ప్ర‌జాప్ర‌తినిధుల్లో బంధువులు ఉండ‌డం కామ‌న్‌. ఒకే అసెంబ్లీలో అన్న‌ద‌మ్ములు, వియ్యంకులు, బావ‌బావ‌మ‌రుదులు ఎమ్మెల్యేలుగా ఉన్న సంద‌ర్భాలు మ‌నం అనేకం చూశాం. ప్ర‌స్తుత ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భ‌వానీ తండ్రి, కూతురు అవుతారు. ( దివంగ‌త ఎర్ర‌న్న కుమార్తే భ‌వానీ అన్న‌ది తెలిసిందే). ఇక చంద్ర‌బాబు, బాల‌య్య వియ్యంకుళ్లు. ఇక వైసీపీ నుంచి ఇప్ప‌టికే మంత్రాల‌యం. గుంత‌క‌ల్‌, ఆదోని ఎమ్మెల్యేలు ముగ్గురు ఇప్ప‌టికే అన్న‌ద‌మ్ములుగా ఉన్నారు.

Kethireddy Venkatarami Reddy Slams Chandrababu On Corruption - Sakshi

అలాగే ఇదే ఏపీ అసెంబ్లీలో తండ్రి, కొడుకు, అల్లుడు కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈ విష‌యం చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే తెలుసు. అనంత‌పురం జిల్లా ధ‌ర్మ‌వ‌రం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆయ‌న దివంగ‌త నేత సూరీడు త‌న‌యుడు. ఆయ‌న తండ్రి గ‌తంలో ధ‌ర్మ‌వ‌రం ఎమ్మెల్యేగా గెలిచారు. తండ్రి మృతి త‌ర్వాత రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన వెంక‌ట్రామిరెడ్డి 2009లో కాంగ్రెస్ నుంచి 2019లో వైసీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు.

Tadipatri: కేసుల్లో అధినేతనే మించిపోయిన వైసీపీ అభ్యర్థి - tadipatri ysrcp  mla candidate kethireddy pedda reddy affidavit shows 32 criminal cases |  Samayam Telugu

ఇక ఆయ‌న బాబాయ్ కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిప‌త్ర ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డికి స్వ‌యానా బావ‌మ‌రిది. అంటే తండ్రి, కొడుకులు అయ్యే పెద్దారెడ్డి, వెంక‌ట్రామిరెడ్డితో పాటు పెద్దారెడ్డికి అల్లుడు వ‌రుస అయ్యే సుధీర్‌రెడ్డి ఇలా ముగ్గురు అసెంబ్లీలో ఒకే పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్న ఘ‌న‌త సొంతం చేసుకున్నారు.

INTERVIEW | Faction politics a thing of past, now people think wisely and  oppose it strongly: Dr M.S- The New Indian Express

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news