పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన నటిస్తోన్న వకీల్‌సాబ్ సినిమా కోసం ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. కరోనా హడావిడి తగ్గడంతో ఈ సినిమా దసరా రేసులో ఉంటుందని అందరు అనుకున్నారు. అయితే ఈ సినిమా యూనిట్ నుంచి అలాంటి హడావిడి ఉన్నట్టు అనిపించడం లేదు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం ప్రకారం వకీల్‌సాబ్ దసరా రేసులో ఉండడంపై సందేహాలే వ్యక్తం అవుతున్నాయి. ఈ టాక్‌ను బట్టి చూస్తే పవన్ ఫ్యాన్స్‌కు నిరాశ తప్పేలా లేదు.
మరోవైపు థియేటర్లను ఈ నెల 15వ తేదీ నుంచి తిరిగి ప్రారంభించుకోవచ్చని ప్రభుత్వాలు చెపుతున్నాయి. కొందరు నిర్మాతలు తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 90 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న వకీల్‌సాబ్ దసరాకు కూడా రిలీజ్ కాకపోతే ఇక సంక్రాంతికే వస్తుందనడంలో సందేహం లేదు. వాస్తవానికి ఈ మే నెలలో రిలీజ్ కావాల్సి ఉన్న వకీల్‌సాబ్ కరోనా వల్ల షూటింగ్ జరగలేదు.
ఇప్పుడు దసరాకు అయినా సినిమా వస్తుందని ఆశలు పెట్టుకున్న వాళ్లకు బిగ్ షాక్ తగిలింది. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ఆశలు అన్నీ సంక్రాంతి మీదే ఉన్నాయి. అయితే సంక్రాంతికి కేజీఎఫ్ 2తో పాటు పలు పెద్ద సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. మరి ఇప్పుడు సోలోగా రాకుండా పవన్ వకీల్‌సాబ్ టఫ్ కాంపిటేషన్‌లో సంక్రాంతికి వస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో వసూళ్లు కష్టమే అని చెప్పాలి.