బాలీవుడ్ వర్థమాన నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత డ్రగ్ ఇష్యూ నార్త్ టు సౌత్ సినిమా ఇండస్ట్రీలను ఓ కుదుపు కుదుపుతోంది. సుశాంత్ ప్రియురాలు పలువురు హీరోయిన్ల పేర్లు కూడా బయట పెట్టినట్టు వార్తలు వచ్చాయి. ఇక కన్నడ సినిమా ఇండస్ట్రీని కూడా డ్రగ్స్ ఉదంతం బాగా కుదిపేసింది. ఈ డ్రగ్ ఉదంతంలో టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్ల కన్నా శాండల్‌వుడ్ హీరోయిన్లది డిఫరెంట్ స్టోరీయే అని చెప్పాలి.
కన్నడ హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో రాగిణి కంటే సంజన కేంద్రంగానే అనేక కథలు నడిచినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక విచారణలో సంజన ఆస్తులు చూసిన వాళ్లకు కూడా దిమ్మతిరుగుతోంది. ఈ కేసులో తవ్వేకొద్ది పలు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. సంజన పలువురు సెలబ్రిటీలకు కూడా డ్రగ్స్ సరఫరా దారుగా ఉందని తెలుస్తోంది.
ఆమెకు ఒక్క బెంగళూరులోనే ఏకంగా 23 ప్లాట్స్ ఉన్నాయని.. ఆ ప్లాట్లలో జరిగే పార్టీలకు పలువురు సెలబ్రిటీల పిల్లలను ఆహ్వానించడంతో పాటు ఆమే ఆ పార్టీలో డ్రగ్స్ సరఫరా చేసేదని తెలుస్తోంది. వీటికి సంబంధించి విచారణ అధికారులు కూపీలు లాగుతున్నారు. ఈ అమ్మకాల ద్వారానే ఆమె కోట్లకు పడగలెత్తిందని తెలుస్తోంది. ఈ ప్రచారం బట్టి సంజన డ్రగ్స్ వ్యాపారి అని కూడా శాండల్‌వుడ్‌లో ప్రచారం జరుగుతోంది.