ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లి హడావిడి నడుస్తోంది. గుంటూరుకు చెందిన విశ్రాంత పోలీస్ అధికారి జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక పెళ్లి త్వరలోనే జరగనున్న సంగతి తెలిసిందే. నిహారికకు చైతన్యతో నిశ్చితార్థం కూడా ఇప్పటికే పూర్తి అయ్యింది. పెళ్లి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.నిహారిక పెళ్లి అయిన వెంటనే మెగా ఫ్యామిలీలో మరో పెళ్లి కూడా త్వరలోనే జరగనుంది.
ఆ పెళ్లి ఎవరిదో కాదు మెగా మేనళ్లుడు సాయిధరమ్ తేజ్‌దే. సాయిధరమ్ తేజ్ పెళ్లి ప్రయత్నాలు కూడా మొదలైనట్టు తెలుస్తోంది. తేజ్ పెళ్లి బాధ్యతలను మెగాస్టార్ చిరంజీవి పూర్తిగా తన భుజస్కంధాల మీద వేసుకుని చేస్తున్నాడట. చిరంజీవి సోదరి ప్రస్తుతం తేజూ పెళ్లి కోసం ఆతృతతో ఉంది. ఈ క్రమంలోనే తన మేనళ్లుడు తేజు పెళ్లి బాధ్యతలను అన్నింటిని చిరుయే తన భుజస్కంధా మీద వేసుకుని నడిపిస్తున్నాడట.
అయితే తేజు ప్రేమ వివాహం కాకుండా మేనమామ చిరంజీవి చూసిన పెళ్లి చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. నిహారిక పెళ్లి అయిన వెంటనే తేజు పెళ్లి ఉంటుందట. చిరంజీవికి అత్యంత సన్నిహితులు అయిన కుటుంబానికి చెందిన అమ్మాయితోనే తేజు పెళ్లి జరగబోతోంది. మొత్తానికి టాలీవుడ్ బ్యాచిలర్స్ గ్రూప్ నుంచి మరో హీరో త్వరలో అవుట్ కానున్నాడు.