కరోనా క్రైసిస్ నష్టాల నుంచి బయటపడటానికి నటీనటులు సాంకేతిక నిపుణులు అందరూ తమ రెమ్యురేషన్లు తగ్గించు కోవాలని అందరూ కోరుతున్నా వాస్తవంగా అందుకు స్టార్ హీరోలు, డైరెక్టర్లు ఒప్పుకోవడం లేదట. ఓవరాల్‌గా అందరూ 20 శాతం రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని ప్రొడ్యుసర్స్ గిల్డ్ కీలక నిర్ణయం తీసుకున్నా ఈ మాటను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. తాజాగా ఓ సీనియర్ హీరో – ఓ క్రేజీ డైరెక్టర్ మధ్య ఓ సినిమా రెమ్యునరేషన్ విషయమై గొడవ జరుగుతోందట.
సదరు సీనియర్ హీరో – వరుస హిట్లతో ఉన్న ఈ క్రేజీ డైరెక్టర్ కాంబోలో సినిమా ప్రారంభమైనా ఎందుకో ఏదో ఒక అవాంతరం ఆ సినిమాకు ఎదురవుతోంది. ఆ హీరోతో సినిమా చేసేందుకు సదరు క్రేజీ డైరెక్టర్ ఏకంగా మూడేళ్ల పాటు వెయిట్ చేశాడు. ఇక ఆ సినిమాను కూడా సదరు సీనియర్ హీరో సంబంధీకులే నిర్మిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం అవుతుండడంతో ఆ డైరెక్టర్ రెమ్యునరేషన్ అంశం ప్రస్తావనకు రాగా.. తాను మాత్రం 20 శాతం తగ్గించుకోనని చెపుతున్నాడట.
ఆ సినిమా నిర్మాత గత సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కి ప్లాప్ అయ్యింది. అందుకే ఇప్పుడు కరోనా వల్ల పెట్టుబడి తగ్గించుకోవాలని అనుకుంటున్నా సదరు డైరెక్టర్ మాత్రం తన రెమ్యునరేషన్ తగ్గిస్తే ఊరుకోనని చెపుతున్నాడట. ఇప్పుడు ఈ వివాదం ఆ సీనియర్ హీరో దగ్గరకు వెళ్లిందట. మరి ఆయన దానిని ఎలా పరిష్కరిస్తారో ? చూడాలి. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్‌లో హాట్ టాపిక్గా మారింది.