Newsకాకినాడ‌లో ఘోరం.. పెళ్ల‌యిన యువ‌తిపై పెద‌నాన్న అత్యాచారం..!

కాకినాడ‌లో ఘోరం.. పెళ్ల‌యిన యువ‌తిపై పెద‌నాన్న అత్యాచారం..!

స‌మాజంలో రోజు రోజుకు కామాంధుల ఆగ‌డాలు పెరిగిపోతున్నాయి. చివ‌ర‌కు కొంద‌రు కామంతో క‌ళ్లు మూసుకుపోయి వావి వ‌ర‌స‌లు కూడా మ‌ర్చిపోతున్నారు. చిన్న పిల్ల‌లు, మైన‌ర్లు అని కూడా చూడ‌కుండా అత్యాచారాలు చేస్తున్నారు. ఏపీలో తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ‌లో కూతురుపై పెద‌నాన్నే క‌న్నేశాడు. అప్ప‌టికే పెళ్ల‌యిన ఆ యువ‌తిపై క‌న్నేసిన పెద‌నాన్న ఆమెపై అత్యాచారం చేశాడు.

 

అక్క‌డితో ఆగ‌ని ఆ మృగాడు తాజాగా ఆమె ఇంటికి వెళ్లి అత్యాచారం చేసేందుకు ప్ర‌య‌త్నించ‌డంతో ఆమె తీవ్రంగా ప్ర‌తిఘ‌టించింది. ఆ త‌ర్వాత ఆమె పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. స‌ర్ప‌వ‌రం జంక్ష‌న్ ప‌రిధిలోని బుడంపేటకు చెందిన వివాహితపై ఆమెకు పెదనాన్న వరసయ్యే వ్యక్తి ఈ అఘాయ‌త్యానికి పాల్ప‌డ్డాడు.

 

రెండేళ్ల క్రింద‌టే త‌న‌పై అత్యాచారం చేశాడ‌ని.. గత సెప్టెంబ‌ర్లో మ‌రోసారి త‌న ఇంటికి వ‌చ్చి అత్యాచారం చేసేందుకు ప్ర‌య‌త్నించాడ‌ని బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. బాధిత మ‌హిళ‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ప్ర‌స్తుతం వివాహిత అభియోగాల‌పై విచార‌ణ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news