శ్రీలంక లెజెండ్రీ స్పినర్ ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్‌కు వస్తున్నాడంటేనే ప్రపంచంలో మహామహా బ్యాట్స్‌మెన్స్ సైతం గజగజ వణికిపోయేవారు. మురళీధరన్ బంతి ఎటు తిరిగి ఎటు వచ్చి వికెట్లను ముద్దాడుతుందో ? తెలిసేదే కాదు. ఇక ఆయన చెన్నైకు చెందిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. మురళీధరన్ జీవితంపై ఓ బయోపిక్ వస్తుందన్న వార్తలు ఎప్పటి నుంచో ఉన్నాయి. దీనికి సంబంధించి ఆ సినిమా యూనిట్ ఎట్టకేలకు ఓ అప్డేట్ ఇచ్చింది.
ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని కూడా చెప్పింది. ప్రపంచ క్రికెట్లో మురళీధరన్ ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్నారు. వన్డేల్లో 534 వికెట్లు, టెస్టుల్లో 800 వికెట్లు సాధించిన మురళీ ఆ తర్వాత కోచ్‌గాను, ఐపీఎల్లో సన్ రైజర్స్ జట్టుకు స్పిన్ కోచ్‌గా కూడా వ్యవహరించాడు. ఇక ఇప్పుడు ఆ క్రికెటర్ జీవితం ఆధారంగా తెరకెక్కే బయోపిక్‌లో కోలీవుడ్ క్రేజీ హీరో విజయ్ సేతుపతి మురళీధరన్‌గా నటిస్తున్నాడు.
విజయ్ సేతుపతి ఇప్పటికే మురళీధరన్ మ్యానరిజమ్స్‌తో పాటు అతడు బౌలింగ్ శైలీ, స్పిన్ యాక్షన్, మైదానంలో అతడు ఎలా ఉంటాడు అనే అంశాలను ఔపాసన పడుతున్నాడు. అతను పాత్రతో పక్కాగా మెప్పిస్తాడని నిర్మాతలు భావిస్తున్నారు. మురళి స్నేహితుడు, శ్రీలంక మాజీ క్రికెటర్, కామెంటరేటర్ రస్సెల్ ఆర్నాల్డ్ పాత్రలో కమెడియన్ యోగి బాబు మెరవనున్నట్లు తెలుస్తోంది.
ఇక మురళీధరన్ చెన్నై అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో పాటు భారత్‌తో అతడికి ఎంతో అనుబంధం ఉండడంతో ఈ దిగ్గజ క్రికెటర్ బయోపిక్ కోసం భారత సినీ, క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు.