Newsమీరు పంపిన వాట్సాప్ మెసేజ్ ఆటోమేటిక్ డిలీట్‌

మీరు పంపిన వాట్సాప్ మెసేజ్ ఆటోమేటిక్ డిలీట్‌

ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా యాప్ వాట్సాప్ ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త ఫీచ‌ర్లు, అప్‌డేట్స్‌తో వినియోగ‌దారుల మ‌న‌స్సుల‌ను చూర‌గొంటోంది. ఇటీవ‌లే యూజ‌ర్ల అనుమ‌తి లేకుండా ఇత‌రులు వారి వాట్సాప్‌లోకి లాగిన్ అవ్వ‌కుండా ఫింగ‌ర్ ప్రింట్ అథెంటికేష‌న్ అందుబాటులోకి వ‌చ్చింది. ఇక ఇప్పుడు మ‌రో కొత్త ఫీచ‌ర్ కూడా అందుబాటులోకి రానుంది. ఇత‌రుల‌కు మీరు పంపిన వీడియోలు, టెక్ట్స్ మెసేజ్‌లు, ఎమోజీలు మ‌నం సెట్ చేసిన టైం ప్ర‌కారం అవ‌త‌లి వైపు యూజ‌ర్ల చాట్‌లో ఆటోమేటిక్‌గా డిలీట్ కానున్నాయి.

 

 

ఇప్ప‌టికే ఈ ఛాన్స్ ఉన్నా.. నిర్ణీత స‌మ‌యం త‌ర్వాత అలా డిలీట్ చేయ‌డం కుద‌ర‌దు. దీనిని సెట్ చేసేందుకే మ‌రో కొత్త ఫీచ‌ర్ వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుంది. మ‌నం ఇత‌రుల‌కు పంపిన మెసేజ్ 10 నిమిషాల త‌ర్వాత డిలీట్ అవ్వాల‌న్నా లేదా గంట త‌ర్వాత డిలీట్ అవ్వాల‌న్నా సెండ్ బ‌ట‌న్ ప‌క్క‌న ఉన్న టైమ‌ర్‌లో ఆ టైం సెట్ చేస్తే చాలు.

 

 

ఆ స‌మ‌యం దాటాక ఆ మెసేజ్ ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతుంది. అంతేకాకుండా చాట్‌ నుంచి బయటకు వస్తే ఆటోమేటిగ్గా మీరు పంపిన డేటా అంతా డిలీట్‌ అయ్యేలా కూడా వాట్సాప్‌ ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందు ఈ ఫీచర్లను బీటా యూజర్లకు అందుబాటులోకి తెచ్చి ఆ తర్వాత స్టేబుల్‌యాప్‌లో అప్‌డేట్‌ చేస్తారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news