కరోనా వైరస్ దెబ్బతో అగ్ర రాజ్యం అమెరికా చిగురు టాకులా వణికిపోయింది. ఇప్పుడిప్పుడే కేసుల తీవ్రత తగ్గడంతో కాస్త కోలుకుంటున్నా ఇప్పటకీ ప్రపంచంలో అమెరికాలోనే ఎక్కు వ కరోనా కేసులు ఉన్నాయి. ఇక తమ దేశ పౌరులను కాపాడుకునేందుకు ట్రంప్ వ్యాక్సిన్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే కోవిడ్‌కు వ్యాక్సిన్ వస్తుందని చెపుతోన్న ఆయన వ్యాక్సిన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది అమెరికన్లకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
2021 ఏప్రిల్ నాటికి ప్రతి అమెరికన్‌కు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేలా ప్లానింగ్ చేశామని ట్రంప్ తెలిపారు. వ్యాక్సిన్‌కు ఆమోదం వచ్చిన వెంటనే తమ దేశ ప్రజలకు అవసరమైన మోతాదులో వ్యాక్సిన్ తయారు చేస్తామని ఆయన చెప్పారు. కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసేందుకు శాస్త్రవేత్తలు, వైద్యులు అహర్నిశలు కష్టపడుతున్నారంటూ వారికి ట్రంప్ కితాబు ఇచ్చారు.
వ్యాక్సిన్ అభివృద్ధి చేయడమే తమ మొదటి ప్రాధాన్యత అని చెప్పిన ట్రంప్ వ్యాక్సిన్‌కు ఆమోదం వచ్చిన 24 గంటల్లోనే పంపిణీ ప్రారంభిస్తామన్నారు. ఇక అమెరికాలో ఇప్పటి వరకు 67 లక్షల కేసులు, 2 లక్షల మరణాలు సంభవించాయి.