బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జ‌బ‌ర్ద‌స్త్ అవినాష్ రెమ్యున‌రేష‌న్ ఇదే..!

తెలుగు బుల్లితెర పాపుల‌ర్ రియాల్టీ షో బిగ్‌బాస్ నాలుగో సీజ‌న్ రెండో వారాంతంలోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి వారంలో డైరెక్ట‌ర్ సూర్య కిర‌ణ్ ఎలిమినేట్ అవ్వ‌గా రెండో వారంలో 9 మంది నామినేష‌న్లో ఉండ‌డంతో ఎవ‌రు ఎలిమినేట్ అవుతారా ? అన్న‌ది ఆస‌క్తిగా మారింది. ఇక తొలి వారం ఈ రోజుల్లో ఫేం సూర్య వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి సంద‌డి చేస్తున్నాడు. ఇక రెండో వారంలో జ‌బ‌ర్ద‌స్త్ ఫేం ముక్కు అవినాష్ రాక‌తో హౌస్ మ‌రింత సంద‌డిగా మారింది.

 

బిగ్‌బాస్ హౌస్‌లోకి జోక‌ర్ అంటూ అవినాష్‌ ఎంట్రీ ఇవ్వ‌డంతోనే హౌస్‌కు ఒక్క‌సారిగా క‌ళ వ‌చ్చేసింది. ఇక అవినాష్‌కు వారానికి రు. 5 ల‌క్ష‌లు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది అట‌. ఆ విధంగా బిగ్‌బాస్ నిర్వాహ‌కులు అవినాష్‌తో బాండ్ కూడా రాయించుకున్నార‌ట‌. అయితే మ‌నోడు పొర‌పాటున బ‌య‌ట‌కు రావాల‌నుకుంటే మాత్రం రూ. 10 ల‌క్ష‌లు క‌ట్టేలా ఒప్పందం కుదిరింద‌ట‌.

 

అయితే హౌస్‌లో క‌నీసం అవినాష్ 10 వారాలు ఉన్నా రు. 50 ల‌క్ష‌లు వ‌స్తాయ‌న్న ప్లాన్‌తోనే హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడ‌ని అంటున్నారు. మ‌రి అవినాష్ ఫైన‌ల్ వ‌ర‌కు ఉంటాడా ?  లేదా ? అన్న‌ది చూడాలి. ఇక హౌస్‌లో రెండో వారం కెప్టెన్‌గా నోయ‌ల్ ఉన్నాడు.

Leave a comment