వైఎస్సార్‌సీపీ అసంతృప్త ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి అసలు సిసలు సవాల్ విసిరారు. వైసీపీ ప్రభుత్వానికి సర్కార్ అంటే ఎంత మాత్రం గౌరవం లేదన్న ఆయన రాజ్యాంగాన్ని మార్చే హక్కు శాసనసభకు లేదన్న కనీస అవగాహన కూడా లేదని మండిపడ్డారు. న్యాయవ్యవస్థ వల్లే ప్రజలు అన్యాయానికి గురవ్వకుండా బతుకుతున్నారని రఘురామ తెలిపారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం న్యాయ వ్యవస్థను గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు.
గత ప్రభుత్వ నిర్ణయాలపై మంత్రివర్గ ఉపసంఘం వేయడం హాస్యాస్పదంగా ఉందన్న ఆయన రాజధాని భూముల అంశంపై సీబీఐ విచారణ జరపాలని ధర్నా చేశారు కానీ.. అంతర్వేది ప్లకార్డు, ప్రత్యేక హోదా కోసం ప్లకార్డు ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. మన ప్రభుత్వం భవిష్యత్తులో మాజీ ప్రభుత్వం అవుతుందని.. ఇలా గత నిర్ణయాలు అన్ననింటిని సమీక్షించుకుంటూ పోతే ఎలా అని ప్రశ్నించారు.
ఇక తనపై చేయి వేస్తే రక్షణ ఇచ్చేందుకు రాజు భయ్యా లాంటి వారు అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నారన్న ఆయన తాను కరోనా తగ్గాక పులివెందులకు వెళతానని.. అక్కడ 10 వేల మందితో బహిరంగ సభ నిర్వహిస్తానని సవాల్ విసిరారు. మరి రఘురామ ఏకంగా సీఎం ఇలాకా టార్గెట్‌గా చేసుకుని సవాల్ విసిరారు. దీనిపై వైసీపీ నేతల నుంచి ఎలాంటి రిటక్ట్ వస్తుందో ? చూడాలి.