Moviesబాబాయ్ ప్లాప్ క్యారెక్ట‌ర్‌లో ఎన్టీఆర్ స‌క్సెస్ అవుతాడా...!

బాబాయ్ ప్లాప్ క్యారెక్ట‌ర్‌లో ఎన్టీఆర్ స‌క్సెస్ అవుతాడా…!

వ‌రుస విజ‌యాల‌తో ఉన్న జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే సినిమాలో ఎన్టీఆర్ న‌టిస్తాడు. ఆ సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే సినిమాలో న‌టించేందుకు రెడీ అవుతున్నాడు.

 

ఇప్పటికే మైత్రీ మూవీస్ వారు ఎన్టీఆర్‌కు, ప్ర‌శాంత్ నీల్‌కు అడ్వాన్స్‌లు కూడా ఇచ్చారంటున్నారు. ఇక ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ ఓ మాఫియా డాన్‌గా న‌టిస్తున్నాడ‌న్న వార్త‌లు ఇండ‌స్ట్రీ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ ప్ర‌పంచాన్నే గ‌డ‌గ‌డ‌లాడించే భ‌యంక‌ర‌మైన మాఫియా డాన్‌గా క‌నిపిస్తాడ‌ని తెలుస్తోంది.

 

ఇక గ‌తంలో ఎన్టీఆర్ బాబాయ్ బాల‌య్య అశోక చ‌క్ర‌వ‌ర్తి సినిమాలో ముంబైలో మాఫియా డాన్‌గా న‌టించాడు. ఆ సినిమాలో ఎంద‌రో మ‌హానుభావులు సాంగ్ హిట్ అయినా ఆ సినిమా మాత్రం ప్లాప్ అయ్యింది. మ‌రి ఇప్పుడు అదే క్యారెక్ట‌ర్‌లో ఎన్టీఆర్ ప్ర‌పంచ డాన్‌గా న‌టిస్తే భారీ అంచ‌నాలు ఉంటాయి. ఈ క్యారెక్ట‌ర్‌లో ఎన్టీఆర్ ఎలా మెప్పిస్తాడో ?  చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news