ఇద్దరు సీనియర్ హీరోయిన్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. వారి మధ్య మాటలు తూటాల్లా పేలాయి. బీజేపీ ఎంపీ రవికిషన్ ఇటీవల మాట్లాడుతూ ఇండస్ట్రీలో కొందరు మాదక ద్రవ్యాలకు బానిసలు అవుతున్నారని.. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యాఖ్యలను ఖండించిన రాజ్యసభ సభ్యురాలు జయాబచ్చన్ ఒకరిద్దరు చేసిన తప్పులకు మొత్తం సినీ పరిశ్రమను నిందించడం తగదన్నారు. ఓ నటుడు అయిన ఎంపీ ఇలా మాట్లాడడం బాధాకరమని జయ ఖండించారు.
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో సినిమా పరిశ్రమ కూడా రెండుగా చీలిపోయింది. కొందరు జయకు సపోర్ట్ చేస్తుంటే.. మరి కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై మరో సీనియర్ హీరోయిన్, బీజేపీ నేత జయప్రద స్పందించారు. రవికిషన్ వ్యాఖ్యలను అడ్డంపెట్టుకుని జయాబచ్చన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు బానిస అయిన వారిని కాపాడేందుకు రవికిషన్ ప్రయత్నిస్తున్నారని.. ఆయనకు తాను మద్దతు ఇస్తున్నానని చెప్పారు. ఈ అంశాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయాలనుకోవడం జయాకు తగదన్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగానే మనమంతా పోరాడాలని జయప్రద పిలుపు ఇచ్చారు.